Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెపోటు వస్తే చావడమేనా? బతికే అవకాశం లేదా? ఇదోరకమైన చర్చ.అన్ని జబ్బులకు చావే పరిష్కారం కాదు. కానీ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం అలవాటుగా మారాలనేది వైద్యుల సూచన. గుండె తన స్థితి గురించి కొన్ని సంకేతాలను అందిస్తుంది.చాలామందిలో గుండెనొప్పి, ఆయాసం వస్తున్నా గ్యాస్ట్రిక్ సమ స్యగా నిర్లక్ష్యం చేయకూడదు.రక్తపోటు, మధుమేహం లాంటివి ఉంటే అప్రమత్తత అవసరం. ఎక్కువ వ్యాయమం చేసినప్పుడు, డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు రకరకాల హార్మోన్లు వెలువడుతాయి. వీటివల్ల ఆరోగ్యవంతులకు గుండెలయ తప్పుతున్నది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల సమస్య తలెత్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ సమస్యలు కూడా గుండెపోట్లకు కారణమని నిపుణుల విశ్లేషణ. దేశంలో అత్యధికంగా గుండెపోట్లతో చనిపోతున్నవారి సం ఖ్యలో లక్షద్వీప్ మొదటిస్థానంలో ఉండగా డామన్,డయ్యూ రెండో స్థానం, తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది.
పదిహేను రోజుల కిందట ఓ సినీనటుడు..వారం రోజుల కిందట ఓ పెండ్లికి హాజరైన బంధువు.. నాలుగు రోజుల కిందట బరాత్‌లో డ్యాన్స్ చేస్తున్న యువకుడు హఠాత్తుగా చనిపోయారు. కారణం గుండెపోటు. ఈ కాలంలో సుమారు యాభైమంది వరకు ఇలాగే తనువు చాలించారు. యాక్సిడెంట్లు, కరెంట్ షాక్‌లు, మర్డర్లు, మానభంగాలు ఇవి నిత్యం కనిపించే వార్తలు. కానీ ఇటీవల చూసుకున్నట్టయితే స్ట్రోక్‌తో చనిపోయిన వారి సంఖ్యనే ఎక్కువ. వీరంతా నలభై ఏండ్లలోపు వారే. ఎందుకీ మరణాలు? అసలు గుండె పదిలమేనా? ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేకపోతుందా? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలివి. మనుషులకు బీపీ, షుగర్, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులనేకం. కొంతమందికి జన్యుపరంగా రావడం సహజం. వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం, జాగ్రత్తలు పాటించడం అనివార్యం. కానీ గుండెపోటుకు గురైన వారు క్షణాల్లోనే కన్ను మూయడం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. వాట్సాప్ తెరిస్తే ఊళ్లలో ఉండే బంధువులు, పనిచేసే ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు, కాలనీలో స్నేహితులు ఎవరో ఒకరు గుండెపోటుతో చనిపోయారనే వార్త గుండెను మరింత బరువెక్కిస్తోంది. ఆందోళన కలిగిస్తోంది.
తెల్లారితేచాలు నిత్యం ఉరుకుల పరుగుల జీవనం. ఎన్నో సమస్యలు, మరెన్నో ఒడిదుడుకులు. మదినిండా మదనపడే ఆలోచనలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అంటే డాక్టర్లు ఇప్పుడు నిర్ధారిస్తున్నది అవును అని. మనం సంతోషంగా జీవించడానికి, కుటుంబంతో గడపడానికి తగిన విశ్రాంతి అవసరమనేది సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వైద్యనిపుణులు, సైకాలజిస్టులు చెబుతున్న వాస్తవం. పత్రికలు, ఛానళ్లు, యూట్యూబ్ కూడా పదేపదే ఇవే నొక్కిచెబుతున్నవి. కానీ అవన్నీ ఒకప్పుడు పెడచెవిన పెట్టినవే. కానీ ఇప్పుడు కుదరదని హెచ్చరిస్తున్నదే గుండెపోటు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దీనిపై రకరకాల అభిప్రాయాలు ఉండటం కాదనలేం. కానీ వాస్తవ కోణాన్ని పరిశీలిస్తే గనుక మనిషి వృత్తి, మానసిక ఒత్తిడి, మారుతున్న జీవనశైలియే ప్రధాన కారణం! కోవిడ్ తర్వాత మనిషిలో అనేక మార్పులు చోటుచేసుకోవడం చూశాం. డిప్రెషన్లోకి వెళ్లిన వారూ అనేకం. వయసు మీదపడే కొద్దీ క్రమంగా గుండె, రక్తనాళాల పని తీరు మందగిస్తుంది. దీనికి ప్రస్తుతం నిర్దిష్ట చికిత్సఏమీ లేదు. కానీ ఆరవై ఏండ్ల తర్వాత రావాల్సిన గుండెపోటు పాతికేండ్లకే రావడం విచారకరం.
దేశంలోనే హాట్‌టాపిక్‌గా మారిన సమస్య హార్ట్స్ట్రోక్. దీనికి వయసుతో నిమిత్తం లేదు. చిన్నా, పెద్దా వ్యత్యాసం చూడదు. స్త్రీ,పురుష బేధం అస్సలే లేదు. వచ్చిదంటే చాలు మృత్యు కుహలోకి తీసుకెళ్లడమే తరువాయి. అన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునే కన్నడ నటుడు పునిత్ రాజ్‌కుమార్, నిత్యం వ్యాయమానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి, అశేష జనావాహిని మధ్య ఉత్సాహంగా నడిచిన నందమూరి తారకరత్న గుండెపోటుతోనే చనిపోయారు. తాజాగా మూడు రోజుల కిందట బాలివుడ్ నటి సుస్మితాసేన్‌కు గుండెలో నొప్పి రావడంతో హాస్పిటల్ చేరినట్టు వార్తలు. ఎందుకీ గుండెపోటు అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్త్తృతమైన చర్చ. ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేని జీవనం, నిద్ర లేకపోవడం, అధిక బరువు, కొలెస్ట్రాల్ ఇలా అనేక కారణాలతో గుండె ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. రోజుకు అరగంట వ్యాయామం, పౌష్టికాహారం తప్పనిసరి అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం చేయడం కూడా నష్టం చేస్తున్నది. ఒక్క హైదరాబాద్‌లోనే హృద్రోగ సమస్యలతో ఏటా పదిహేను వేల వరకు ఓపెన్ హార్ట్ సర్జరీలు జరుగుతున్నట్టు నివేదికలు. ఒక్క నిమ్స్‌లోనే వెయ్యికి పైగా బైపాస్ సర్జరీలు జరగడం మనిషి గుండె పనితీరుకు అద్దం పడుతోంది.
గుండెపోటు వస్తే చావడమేనా? బతికే అవకాశం లేదా? ఇదో రకమైన చర్చ. అన్ని జబ్బులకు చావే పరిష్కారం కాదు. కానీ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం అలవాటుగా మారాలనేది వైద్యుల సూచన. గుండె తన స్థితి గురించి కొన్ని సంకేతాలను అందిస్తుంది. చాలా మందిలో గుండెనొప్పి, ఆయాసం వస్తున్నా గ్యాస్ట్రిక్ సమ స్యగా నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు, మధుమేహం లాంటివి ఉంటే అప్రమత్తత అవసరం. ఎక్కువ వ్యాయమం చేసినప్పుడు, డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు రకరకాల హార్మోన్లు వెలువడుతాయి. వీటివల్ల ఆరోగ్యవంతులకు గుండెలయ తప్పుతున్నది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల సమస్య తలెత్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ సమస్యలు కూడా గుండెపోట్లకు కారణమని నిపుణుల విశ్లేషణ. దేశంలో అత్యధికంగా గుండెపోట్లతో చనిపోతున్న వారి సంఖ్యలో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉండగా డామన్, డయ్యూ రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ హృదయాన్ని పదికాలాల పాటు కాపాడుకోవడమే పరమావధి.