Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవత్వమూ మరచి, కనీస మనుష్య విలువను మరుస్తూ వ్యవహరిస్తున్న నీచాతినీచులు మన సమాజంలో క్రూరత్వాలకు పాల్పడుతున్నారు. ఇటతీవల మన భాగ్యనగరంలో ఒక పాఠశాలలో నాలుగేండ్ల విద్యార్థినిపై గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ కారు డ్రైవర్ ఉదంతం అందరి హృదయాలను కలచివేసింది. అమ్మాయిల వస్త్రధారణ, ప్రవర్తనలే అత్యాచారాలకు కారణమని నమ్ముతున్న నాయక గణాలు, ఈ పసిపాప ఏ ప్రవర్తనకు పాల్పడిందో, ఏ వస్త్రధారణ చేసిందో చెప్పాల్సిన అవసరముంది. అంతేకాదు, అమ్మాయిలను అత్యాచారం చేసి, హత్యలు చేసి, శిక్షలు పడ్డవాళ్ళను దయాళులై విడుదల చేస్తున్న పరిపాలకులు, ఈ ఘటనలకు కారణమేమిటో, ఎలా నివారిస్తారో చెప్పాల్సిన బాధ్యత వుంది. ఆడపిల్లలను చులకనగా, వివక్షతతో చూసే వాళ్లందరూ నేటి నరకాసురులుగానే భావించాలి.
''చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనందజ్యోతుల ఆశల వెలుగించు దీపాలవెల్లి' సినిమాలో పాడిన పాట, దీపావళి అనగానే గుర్తుకు వస్తుంది. చీకటి కష్టాలకు, బాధలకు, దారిద్య్రానికి, అజ్ఞానానికి గుర్తుగా చెప్పుకుంటాము. వెలుగును విజ్ఞానానికి, శుభానికి, భాగ్యానికి సంకేతంగా చూస్తాము. ఇవన్నీ మానవజాతి పరిణామక్రమంలో సాంస్కృతిక జీవన గమనంలో ఏర్పడిన భావాభివ్యక్తులు మాత్రమే. కొన్ని సంకేతాలు అలా సంప్రదాయంలో స్థిరపడ్డాయి. అయితే చీకటి వెలుగు అనేవి ప్రకృతి సిద్ధమైన చలనసూత్రంలోని భాగాలు. రెండు విరుద్ధాంశాలలో చర్య ప్రతిచర్యల ద్వారానే ప్రకృతి, సమాజం పరిణామం కొనసాగుతుందనేది విజ్ఞాన శాస్త్రం చెప్పే విషయం. అందులో భాగమే పగలూ, రాత్రి- చీకటి, వెలుగు. వీటికి ఆపాదించిన భావాలు అన్నీ మన సాంస్కృతిక జీవనంలోంచి వచ్చినవే. అవి కేవలం భావాలు. ఒక విషయం మాత్రం మనం ఆపాదించుకోవచ్చు. లేదా విశ్లేషించుకోవచ్చు. అదేమిటంటే వెలుగు.. వెలుతురు ఉన్నపుడే ప్రపంచాన్ని, పరిసరాలను వాటి రూపాన్ని, చలనాన్ని చూడగలుగుతాము. చూసినపుడు కొంత అవగాహన చేసుకోగలుగుతాము. అవగాహన అయితే ప్రతిస్పందన ఉంటుంది. అంటే మన చైతన్యయుత ప్రవర్తనకు ప్రాథమికంగా వెలుగు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే వెలుగు జ్ఞానానికి, చైతన్యానికి సంకేతంగా చెప్పుకోవటం జరుగుతుందని భావన.
చీకటంతా రాత్రిలో పరచుకొని వుంటుంది. రాత్రి అనేది మనకు నిద్రించే సమయం. అందుకనే నిద్రాణ స్థితికి చీకటి సంకేతమయింది. అయినా ఇపుడు రాత్రికి పగలుకు తేడా తెలియనంతగా వెలుగు విరజిమ్మే విద్యుద్దీపాలు మన ముందు వున్నాయి. మనం చేసే పనులూ, ఆలోచనలు కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండానే జరుగుతున్నాయి. అది వేరే విషయం. ఇవన్నీ కూడా మనిషి జీవితానికి పోల్చుకుని అభివృద్ధిని, విజ్ఞానాన్ని, శ్రేయస్సును కోరుకోవటమంటే జీవితమూ వెలిగిపోవాలని అనుకుంటాము. అందుకనే కవి 'ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాలవెల్లి' అన్నాడు. బతుకులో ఆనందం, సంతోషాలు నిండా ఉండాలని, మనం కోరుకున్నవి జరగాలని, ఆశలు నెరవేరాలని అనుకుంటాము. అలా జరిగినపుడే వెలుగులు జీవితంలోకి వచ్చాయనీ భావిస్తాము. సంతోషాన్ని ఇచ్చే అంశాలేవి? దు:ఖాన్ని నింపే విషయాలేవి? అనేది అసలు చర్చ.
పురాణాల ప్రకారం దీపావళి పండుగకు అనేక కథాంశాలున్నాయి. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలను పొందే పర్వదినంగా, రాక్షసుడు, చెడు కార్యాలను చేసే దుర్మార్గుడు నరకాసురుని, కృష్ణుని సహచర్యంలో సత్యభామ వధించిన రోజును నరక చతుర్ధశి అని చెబుతుంటారు. అందుకనే ఆ సంతోషాన్ని దీపాల వెలుగుల్లో ప్రదర్శించి పండుగ చేసుకుంటారనే సంప్రదాయకంగా వివరిస్తూ వుంటారు. కానీ ఇపుడు మన వర్తమానంలో దుర్మార్గులు ఎవరు? ప్రజలను దు:ఖానికి, బాధలకు గురిచేస్తున్న ఆ రాక్షసాధములు ఎవరో తెలుసుకుని వారిని అందమొందించాల్సి వుంది. ఇక సంపద, ఆదాయము పెరగకుండా అడ్డుపడుతున్నదీ ఎవరు? లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఇంటి గడపనూ తాకుతున్నదా? లేకుంటే ఎందుకు? ఇవన్నింటినీ ఆలోచించాల్సి వుంది.
మానవత్వమూ మరచి, కనీస మనుష్య విలువను మరుస్తూ వ్యవహరిస్తున్న నీచాతినీచులు మన సమాజంలో క్రూరత్వాలకు పాల్పడుతున్నారు. ఇటతీవల మన భాగ్యనగరంలో ఒక పాఠశాలలో నాలుగేండ్ల విద్యార్థినిపై గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ కారు డ్రైవర్ ఉదంతం అందరి హృదయాలను కలచివేసింది. అమ్మాయిల వస్త్రధారణ, ప్రవర్తనలే అత్యాచారాలకు కారణమని నమ్ముతున్న నాయక గణాలు, ఈ పసిపాప ఏ ప్రవర్తనకు పాల్పడిందో, ఏ వస్త్రధారణ చేసిందో చెప్పాల్సిన అవసరముంది. అంతేకాదు, అమ్మాయిలను లైంగిక దాడి చేసి, హత్యలు చేసి, శిక్షలు పడ్డవాళ్ళను దయాళులై విడుదల చేస్తున్న పరిపాలకులు, ఈ ఘటనలకు కారణమేమిటో, ఎలా నివారిస్తారో చెప్పాల్సిన బాధ్యత వుంది. ఆడపిల్లలను చులకనగా, వివక్షతతో చూసే వాళ్లందరూ నేటి నరకాసురులుగానే భావించాలి. ఈ దుర్మార్గ మానసికతకు కారణమవుతున్న రాక్షసాన్ని అంతమొందించకుండా సమాజ జీవితంలో దీపావళి వెలుగు ఎక్కడుంటుంది!
ఇక ప్రజల జీవనానికి అవసరమైన అన్ని వస్తు సేవలపై పన్నులు, ధరలు పెంచి బతుకును భారంగా మారుస్తున్న పరిస్థితులు మారిపపుడే కదా సంతోషాల దీపావళి! కోట్లకొలది ఉద్యోగాలు ఊడిపోయి, నిరుద్యోగులై ఆదాయాలు కరువైన వేళ ఆనందాలు ఎలా వుంటాయి! కష్టపడుతున్నా ఫలితం దక్కని కృషీవలుల ఆత్మత్యాగాల పరంపర సాగుతున్న కాలాన వెలుగు వెలిసేనా! బతుకు దు:ఖాలు పోయి, అందరూ ఆనందంగా, సంతోషంగా బతకగలిగిన నాడే దీపావళి పండుగకు నిజమైన అర్థం.