Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమనేది ఒక యుక్తవయసువారిదే కాదు. పెండ్లయినవారు, కానివారు, వృద్ధాప్యం లోనూ ఉంటుంది. కొంతమంది పెండ్లికి ముందు మరికొంతమంది ఆ తర్వాత ప్రేమించు కుంటారు. ఇంకొంత మంది పిల్లల్ని పెంచేటప్పుడు, చదివించేటపుడు వారి బాధ్యతాయు తమైన అడుగుల్లోనూ ప్రేమ కనిపిస్తుంది. అన్నదమ్ముల ప్రేమ, అక్కాచెల్లెళ్ల ప్రేమ, స్నేహితులు, బంధువుల్లోనూ ప్రేమ ఇమిడే ఉంటుంది. కానీ ఇష్టపడితే చాలు.. అని మొదలై ప్రేమించాలనే పట్టుదలతో ఒక కక్షపూరితమైన ధోరణిని బలవంతంగా రుద్దడం మూలంగానే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నవి. ప్రేమ, ఆకర్షణ, వ్యామోహం,ఇవన్నీ వేర్వేరు.అన్నీ ప్రేమకు ముడి పడినవే అనుకుంటే పొరపాటు. ఇందులో వ్యత్యాసాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఉన్మాద చర్యలకు ప్రేరేపించ బడుతున్నవి.
ఇద్దరు స్నేహితులు ఇంజినీరింగ్ చదువుతున్నారు. కాలేజీ నుంచి రోడ్డుపై వస్తుంటే ముగ్గురు యువకులు వచ్చి యాసిడ్ దాడి చేశారు. ఇందులో తీవ్రంగా గాయపడిన స్వప్నిక చావుతో పోరాడి కన్నుమూసింది. ప్రణీత ఏండ్లు గడిస్తేగానీ ప్రాణం నిలబడలేదు. ఈ దాడికి ప్రధాన కారణం ప్రేమకోణం. స్వప్నిక తన ప్రేమను నిరాకరించిందని అక్కసు పెంచుకున్న యువకుడు ఈదాడికి తెగబడ్డాడు. పద్నాలుగు ఏండ్ల కిందటి ఈ ఘటన వరంగల్‌లో అప్పుడు పెను సంచలనమైంది. కానీ కాలం విదిల్చిన కన్నీటి గాయం మాత్రం ఇరు కుటుంబాల్లో ఆరని జ్వాలగానే రగులుతోంది. సరిగ్గా అలాంటిదే ఢిల్లీలో పదిహేడేండ్ల బాలికపై నాలుగు రోజుల కిందట జరిగింది. ఎదురింట్లో ఉండే యువకుడు అతని ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వచ్చి అమ్మాయిపై యాసిడ్ దాడి చేశాడు. ఆమె ఇప్పుడు ఎనభై శాతం కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఎందుకింత దారుణానికి ఒడిగట్టడం? ప్రేమించకపోతే చంపడమేనా? ఈ అధికారం ఎవరిచ్చారు? రోజురోజుకూ పెరుగుతున్న ఈ అఘాయిత్యాలు, లైంగికదాడులు, కత్తిపోట్లు, బలవన్మరణాలకు బాధ్యత ఎవరిది? ఇంతటి ఉన్మాద చర్యలకు ఏ పేరు పెట్టాలి? వీటినెలా అదుపు చేయాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు సమాజంలో ఉత్పన్నమవుతున్నది.
'ప్రేమంటే ఆక్రమణ కాదు.. ఆరాధన' అన్నాడు రచయిత చలం. ప్రేమించే వారికంటే ప్రేమించబడటం కూడా గొప్పేనని మరో కవి అంతర్మథనం. కానీ ఈ ప్రేమత్వాన్ని అర్థం చేసుకోని కొంతమంది వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు.తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే యాసిడ్‌దాడులకు పాల్పడుతున్నారు. గొంతు నులుముతున్నారు. కత్తులతో పొడుస్తున్నారు. హైదరాబాద్‌లో మొన్న ప్రేమించలేదని యువతి ఇంటికొచ్చి ఆమెను కత్తితో పొడిచాడు ఓ క్రూరుడు. ఈ ఘటనలో బిడ్డను కాపాడపోయిన తల్లికి తీవ్ర రక్తస్రావమై ఆస్పత్రిలో కన్నుమూసింది. అప్పటికే ఎన్నో వేధింపులు తట్టుకుని రక్షణ కోసం ఏపీ నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. వీరు ఏ తప్పు చేశారని? ఎందుకీ శిక్ష? ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలు చాలా చోట్ల పెరగడం ఆందోళనా కరం. అయితే నిత్యం భయంతోనే బతకాలా? తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఓ ముక్కుసూటి ప్రశ్న. నియంత్రించేవారి కోసం ఎదురుచూపులు! ఎక్కడో ఓచోట ఇలాంటివి వినపడగానే తమ పిల్లలు సురక్షితమేనా అని మనసులో ఒక తెలియని ఆవేదన.
ప్రేమనేది ఒక యుక్తవయసువారిదే కాదు. పెండ్లయినవారు, కానివారు, వృద్ధాప్యం లోనూ ఉంటుంది. కొంతమంది పెండ్లికి ముందు మరికొంతమంది ఆ తర్వాత ప్రేమించు కుంటారు. ఇంకొంత మంది పిల్లల్ని పెంచేటప్పుడు, చదివించేటపుడు వారి బాధ్యతాయు తమైన అడుగుల్లోనూ ప్రేమ కనిపిస్తుంది. అన్నదమ్ముల ప్రేమ, అక్కాచెల్లెళ్ల ప్రేమ, స్నేహితులు, బంధువుల్లోనూ ప్రేమ ఇమిడే ఉంటుంది. కానీ ఇష్టపడితే చాలు.. అని మొదలై ప్రేమించాలనే పట్టుదలతో ఒక కక్షపూరితమైన ధోరణిని బలవంతంగా రుద్దడం మూలంగానే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నవి. ప్రేమ, ఆకర్షణ, వ్యామోహం,ఇవన్నీ వేర్వేరు.అన్నీ ప్రేమకు ముడి పడినవే అనుకుంటే పొరపాటు. ఇందులో వ్యత్యాసాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఉన్మాద చర్యలకు ప్రేరేపించ బడుతున్నవి.
దేశంలో మానవమృగాల మానభంగం..పేరు 'నిర్భయ', రాజధానిలో రాక్షసత్వం.. పేరు 'దిశ'. పల్లెలో పసిహృద యంపై వికృతం.. పేరు 'చైత్ర'. ఈ దారుణాలకు పేరులెన్ని పెట్టినా మారుమోగుతూనే ఉన్నవి లైంగికదాడులు. ఆక్రోశిస్తూనే ఉన్నవి కన్నవారి గుండెలు. నిత్యం తెల్లారితే చాలు.. చిన్నారిని చెరచిన కామాంధుడు, కన్న కూతురని కూడా చూడని కసాయి తండ్రి, విద్యా బుద్ధులు నెర్పాల్సిన టీచర్, ఇలా కన్నుమూసి తెరిచేలోగా ఈ అఖండ భారతావానిలో ఏదో ఓచోట ఘోరాలు జరుగుతూనే ఉన్నవి. వారు ఏం చేశారని ఇలాంటి ఆకృత్యాలకు తెగబడుతున్నారు.ఈ విషసంస్కృతి ఎక్కడినుంచి వచ్చింది. ఎందుకు విస్తృతమవుతోంది. సమాజంలోని నేర ప్రభావం పిల్లలపై పడుతున్నదనేది వాస్తవం. వారి ఎదుగుదలలో స్వేచ్ఛ ఉంటుంది. అది పాఠశాలలోనైనా, కళాశాలలోనైనా, బయటనైనా, కానీ వారి మనస్తత్వం, ఆలోచనల్లో వస్తున్న మార్పును గమనిస్తే చెడు వ్యసనాలను అరికట్టడం కొంతైనా సులభం. లేదంటే ఇలాంటి భావోద్రేక ఉన్మాదంలో పడితే వారి భవిష్యత్తే అల్ల కల్లోలం.ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడంకన్నా జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతోమేలని పలువురి అభిప్రాయం.