Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొఘల్ చక్రవర్తులు మనల్ని మూడువందల ఏండ్లు అవిచ్ఛిన్నంగా పరిపాలించారు. కానీ మనది ముస్లిం దేశంగా మారలేదు. అలాగే బ్రిటిష్ వలస పాలకులు వరుసగా రెండువందల ఏండ్లపాటు పరిపాలన సాగించారు. కానీ క్రైస్తవ దేశంగా మారలేదు. కానీ ఇప్పటికిప్పుడు మన దేశానికి, మతానికి ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టుగా దేశ ప్రజల్ని కొంతమంది దారుణంగా భయపెడుతున్నారు. ప్రజల మధ్య నిరాటంకమైన అలజడిని సృష్టిస్తున్నారు. అసలు ఎవరినుంచి దేశానికి ప్రమాదం ఉందో వారైనా చెప్పగలరా? మరి ఎందుకీ విద్వేషాలు? ఇంకెంతకాలం ఈ అసమానతలు? ఎవరి లబ్ది కోసం ఈ యాత్రలు, ప్రదర్శనలు! అందుకే పైన చెప్పుకున్నట్టుఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో, వాటికోసం ఎలాంటి విధానాలు అనుసరిస్తు న్నారో పరిశీలించాల్సిన సమయమిది. వారి బారి నుంచి ప్రజల్ని రక్షించాల్సిన తరుణమిది..
'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అన్నాడు రష్యా విప్లవకారుడు లెనిన్. సరిగ్గా ఆ మాటల్ని గనుక అర్థం చేసుకున్నట్టయితే దేశంలో జరుగుతున్న పరిణామాల్ని బేరీజు వేసుకోవచ్చు. ఎందుకు ఈ విషయాల్ని చెబుతున్నానంటే దేశంలో అసమానత పెరుగుతున్నది. కులం, మతం, ప్రాంతం పేరుతో జనాల్ని తమకు నచ్చినట్టుగా వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. జరుగుతున్న కల్లోల పరిణామాల్ని జాగ్రత్తగా గమనించకపోతే ప్రజల మధ్య అంతరాలు పెరుగుతాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. సరైన దారిని ఎంచుకోవడంతో పాటు ఎదురైన సమస్యను అర్థం చేసుకోవడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. దేశంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఇప్పుడెందుకు వచ్చింది? ఈ అసమానతలకు ఆజ్యం పోస్తున్నదెవరు? ఆలోచించి అడుగు వేయాల్సిన కాలమిది. గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కొంతమంది గల్లీగల్లీలో ఈ వేడుకల్ని నిర్వహించారు. కానీ ఆ సందర్భంగా చేసిన ప్రదర్శనలు, నినాదాలు అనైతికం.. అసమంజసం.
హైదరాబాద్‌లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్‌పేట్‌లోని అకాష్పురి హనుమాన్ మందిర్ నుంచి శోభాయాత్ర చేశారు. ఇందులో పాల్గొన్న కార్యకర్తలు శ్రీరామ్ అనే పేరున్న జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. కానీ దేశ స్వాతంత్రోద్యమంలో అహింస పద్ధతిని భోదించి శాంతిప్రబోదంతో ముందుకు నడిచిన జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథురామ్ గాడ్సే ఫొటోను పట్టుకుని ప్రదర్శన చేశారు. ఇది దేనికి సంకేతం? ఇది భక్తిభావమా? దీనిద్వారా ప్రజలకు ఏం సూచిస్తున్నారు? గాంధీని చంపిన గాడ్సేను నెత్తికెక్కించుకోవడం వెనుక అంతర్యం ఏమిటి? జరిగేది శోభాయాత్ర ఇందులో గాడ్సే ఫొటోను ఎందుకు పట్టుకున్నట్టు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు? సామరస్యత, సౌహార్దత, శాంతియుత, సహనశీలతతో జరిగే ఉత్సవాల్లో ఇలాంటి ప్రదర్శనలు విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా! గతంలోనూ కేంద్రమంత్రిగా ఉన్న ఉమాభారతి గాంధీ ఫొటో ఉన్న దిష్టిబొమ్మను రివాల్వర్‌తో కాల్చినప్పుడు కూడా ఇలాగే వివాదాస్పదమైంది.
ఇక శ్రీరామనవమి అయిపోయింది రానున్నది హనుమాన్ జయంతి దానికి కూడా నగరంలో మూడు లక్షల మందితో విజయయాత్ర చేస్తామని కొంతమంది ప్రకటిస్తున్నారు. దేశంలో మన తాతా, ముత్తాతల నుంచి పండగలు చేసుకోవడం, ఇష్టదేవతలను ఆరాదించడం ఆచార సాంప్రదాయంగానే కొనసాగుతున్నది. వీటిని కాదనలేం. ఎవరి ఇష్టం వారిది. కానీ రామున్ని ఆరాధించే వారే హిందువులని, ఆయోధ్యనే మనకు అతి పెద్ద ఆలయమని పోల్చడం విద్వేషరాగం కాదా! నిజంగా రామభక్తి ఉంటే కర్నాటక రాష్ట్రంలో జరిగిందేమిటి? బీదర్ జిల్లా బసవ కల్యాణ బీజేపీ ఎమ్మెల్యే శరణు సలగర్ రాముడి విగ్రహంపై పాదం మోపారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పూలదండ వేసేందుకు విగ్రహంపై కాలుపెట్టి నిల్చున్నాడు. హిందుత్వవాదులమని చెప్పుకునే వారు హిందూదేవతలను అవమానించినట్టు కాదా? మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వేడుకల్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మెట్లబావి కూలి పద్నాలుగు మంది భక్తులు చనిపోయారు.ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితేంటి? వారిని ఎవరు ఆదుకుంటారు?రామ భక్తులే కదా మరి ఎవరైనా కించిత్తు సాయం చేయలేదేం!