Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిఏటా దేవీ అవార్డులు అందజేస్తోంది. 2023 ఏడాదికి గాను 12మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేశారు. ఆయా రంగాల్లో కృషి చేసిన మహిళల్ని గౌరవిస్తూ అవార్డును అందజేశారు. అందులో ఎంపికైన ముఖ్యుల్లో సుకీర్తరాణి ఒకరు. జడ్జిమెంట్ గ్రూప్‌ను గౌరవిస్తున్నానని, తనను అవార్డుకు ఎంపికచేసినందుకు కృతజ్ఞతలు చెబుతూనే తన నిర్ణయాన్ని వెలిబుచ్చారు. కానీ ఆమె మానసిక క్షోభకు కారణాన్ని కూడా వివరించారు. చెన్నయ్‌కి ఉత్తరంగా కట్టుపల్లి ఓడరేవు అభివద్ధి ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఎంతో మంది రైతుల నుంచి భూములు లాక్కుంది. దీంతో రైతు కూలీలంతా దిక్కులేని వారయ్యారు. ఇది తనను ఎంతగానో బాధించిందని చెప్పి ఆమె అవార్డును తిరస్కరించారు.
ఆటా పాటల్లో మొదటిస్థానంలో నిలిచిన చిన్నారికి ఒక బహుమతి. అది తీసుకెళ్లి తల్లిదండ్రులకు చూపిస్తే అదో అనుభూతి. రేయింబవళ్లు కష్టపడి చదివితే వచ్చే ర్యాంకుతో విద్యార్థికి ఉత్సహం. అది భవిష్యత్తు పునాదికి మెరుగైన సోపానం. మనిషికి తగిన గుర్తింపు రావాలంటే లక్ష్యం, దానిపై ఏకాగ్రత, సాధించాలనే పట్టుదల ఉండాలి. అప్పుడే అనుకున్న విజయాన్ని సాధించగలం. అలాంటి ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అయినవారు సమాజంలో అనేకం. ఓడిన వారూ అంతకన్నా ఎక్కువే. కానీ గెలిచినవారి గురించే దేశం మాట్లాడుతుంది. అంటే విజయం విలువ అలాంటిది మరి. మనం అనుకున్న రంగంలో రాణించినప్పుడు, సమాజానికి చేసిన సేవలకు గాను వివిధ సందర్భాల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఆవార్డును ప్రకటిస్తాయి. దాన్ని పెద్దల సమక్షంలో అందజేసి సత్కరిస్తారు. ఎందుకు? ఈ పోటీ ప్రపంచంలో సవాళ్లెక్కువ. దాన్ని నిలుదొక్కుకోవాలనేది అభిమతం. అది నేటితరానికి స్ఫూర్తి దాయకం. అలాంటి కృషికి తగిన ఫలితం వచ్చి ఆవార్డును ప్రకటిస్తే దాన్ని తిరస్కరిస్తారా? దాన్ని తిరస్కరించేంత ఆగ్రహం, అసహనం ఏమై ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన అంశం. దేశం ఎటుపోతోంది? ఏమైపోతోంది? ఎవరి పంచన చేరింది? ఇలా అనేక ప్రశ్నల వర్షం నుంచి కొంతమంది సమాధానాలు వెతుకుతారు. అలా జరిగిన ఓ మహిళా కవయిత్రి మేధో సంఘర్షణ దేశంలో చర్చకు దారి తీసింది. తనకు వచ్చిన అవార్డును తీసుకోనని తమిళనాడుకు చెందిన ఓ కవయిత్రి ప్రకటించింది. దానికి కారణం! అవార్డు స్పాన్సర్స్ ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కావడమే.
తమిళనాడు రాష్ట్రంలోని రానిపేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న సుకీర్తారాణి కవయిత్రి, సామాజిక కార్యకర్త. తమిళభాషలో దళిత సాహిత్యంపై పేరొందిన రచనలు చేశారు. సామాజిక కార్యకర్తగా ప్రజల కోసం పాటుపడ్డారు. ఎన్నో సేవాదృక్ఫథ కార్యక్ర మాలు, అవగాహనలు కల్పించారు. కవయిత్రిగా చేసిన కషిని గుర్తిస్తూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె రాసిన తమిళ కవితలు తమిళనాడులోని కళాశాల పాఠ్యాంశాలలో ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, జర్మన్ భాషల్లో అనువాదం పొందాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలకు ఇచ్చే 'దేవి' అవార్డుకు ఈ ఏడాది ఆమె ఎంపికయ్యారు. చెన్నరులో అవార్డుల బహూకరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కార్యక్రమానికి పుదుచ్చెరి గవర్నర్ కిరణ్ బేడి హాజరై అవార్డులు ప్రదానం చేశారు. అదానీ గ్రూప్, వెల్లూర్ ఇనిస్టిట్యూట్, ప్రముఖ దుస్తుల తయారీ బ్రాండ్ అహుజా సన్స్ ఈ ఏడాది దేవి అవార్డులకు స్పాన్సర్స్‌గా ఉన్నాయి. ఈవిషయం తెలుసుకున్న అవార్డు విజేత సుకీర్తారాణి తాను ఈ అవార్డును తీసుకోవటం లేదని బహిరంగంగా ప్రకటించారు. తాను నమ్మిన విలువలకు, సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లలేనని, అందువల్లే దీన్ని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. ఇది చిన్నవిషయమేమి కాదు. దేశంలో ఇలాంటి ప్రకటనలు, తిరస్కరణలు మేధావుల ఆవేదన, అసహనాన్ని నొక్కి చెబుతున్నాయి.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిఏటా దేవీ అవార్డులు అందజేస్తోంది. 2023 ఏడాదికి గాను 12మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేశారు. ఆయా రంగాల్లో కృషి చేసిన మహిళల్ని గౌరవిస్తూ అవార్డును అందజేశారు. అందులో ఎంపికైన ముఖ్యుల్లో సుకీర్తరాణి ఒకరు. జడ్జిమెంట్ గ్రూప్‌ను గౌరవిస్తున్నానని, తనను అవార్డుకు ఎంపికచేసినందుకు కృతజ్ఞతలు చెబుతూనే తన నిర్ణయాన్ని వెలిబుచ్చారు. కానీ ఆమె మానసిక క్షోభకు కారణాన్ని కూడా వివరించారు. చెన్నరుకి ఉత్తరంగా కట్టుపల్లి ఓడరేవు అభివద్ధి ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఎంతో మంది రైతుల నుంచి భూములు లాక్కుంది. దీంతో రైతు కూలీలంతా దిక్కులేని వారయ్యారు. ఇది తనను ఎంతగానో బాధించిందని చెప్పి ఆమె అవార్డును తిరస్కరించారు. ఒక్క సుకీర్తారాణియే కాదు దేశంలో చాలామంది ప్రముఖులు ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి గాను వచ్చిన అవార్డుల్ని కాదనుకున్నారు. కేరళ ఆరోగ్య మంత్రిగా పనిచేసిన కెకె శైలజకు రామన్‌మెగసెసె అవార్డు వస్తే దాన్ని తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ, ప్రముఖ వాయిద్యాకారుడు పండిట్ అనింద్య ఛటర్జీ కూడా తమకు ప్రకటించిన పద్మ పురస్కారాలు తీసుకోబోమని ప్రకటించారు. కారణాలెలా ఉన్నా దేశంలో జరుగుతున్న విధ్వంసకర, విచ్ఛిన్న సంస్కృతికి వ్యతిరేకంగా మేధావులు అవార్డులను తిరస్కరిస్తూ తమ నిరసన గళాన్ని ప్రకటిస్తున్నారు.