Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లల చదువుకోసం, స్వేచ్ఛకోసం, ప్రపంచ శాంతి కోసం నిత్యం మాట్లాడే ఆమె, పదిహేడేళ్ళ వయసులో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. 2014లో 'నోబెల్ శాంతి బహుమతి' అందుకుంది. అదే సంవత్సరంలో 'బాలల నోబెల్ బహుమతి' తీసుకుంది. అతి చిన్న వయసులోనే ఆడపిల్లల చదువు కోసం ప్రాణాలకు తెగించిన మలాలా ధైర్యం ప్రపంచ యువతకు స్ఫూర్తి దాయకం. కర్ణాటక హిజాబ్ పోరాటంలో తీవ్రంగా వేదించబడ్డ విద్యార్థిని, తన చదువుకునే హక్కును హరించే హక్కు ఎవరికీ లేదని పోరాడి పీ యూ సీలో కర్ణాటక స్టేట్ రెండవ ర్యాంక్ సాధించి మలాలా వారసురాలిగా నిలిచింది. ఇలా మలాలా ఎందరికో ఉత్తేజం.
మలాలా ఓ నిప్పు కణిక. నిత్యం రగిలే ఓ జ్వాల. ఛాందసవాద తాలిబాన్లపై తిరగబడ్డ బావుటా. ప్రపంచ శాంతి కోసం పోరాడుతున్న యువతి. ఆడపిల్లల చదువుకోసం తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న సాహసి. వారు ఆమె మెదడును చీల్చాలనుకున్నారు. మళ్ళీ మాట్లాడకుండా చేయాలనుకున్నారు. కాని ఆమెలోని పట్టుదల, చదువుకోవాలనే బలమైన కోర్కె ముందు ఆ ఛాందసవాదం ఓడిపోయింది. అనంతరం తను స్వేచ్ఛగా చదువుకుంది. ఎక్కడ తీవ్రవాదుల దాడులు జరిగినా ఖండిస్తుంది. ముఖ్యంగా బాలికల చదువుకై ఉద్యమిస్తుంది. అలాంటి సాహసి పుట్టినరోజును ఐక్యరాజ్య సమితి 'మలాలా డే'గా ప్రకటించింది.
ఆన్నేఫ్రాంక్ అనే పన్నెండేళ్ళ అమ్మాయి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ సైన్యానికి వ్యతిరేకంగా రహస్యంగా ఓ డైరీ రాస్తుండేది. కాని చివరకు ఆ అమ్మాయి హిట్లర్ సైన్యానికి పట్టుబడింది. 15 ఏండ్లకే మరణించింది. ఆమె చనిపోయిన ఎన్నో ఏండ్లకు ఆమె రాసుకున్న ఆ డైరీ బయట పడింది. హిట్లర్ పాలనలో ప్రజల జీవితాలు ఎలా మగ్గిపోయేవో కళ్లకు కట్టిన డైరీ అది. 'డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్' పేరుతో ఇది నేటికీ సుప్రసిద్దం. తర్వాత బిబిసి ఉర్దూ శాఖ 'గుల్మకాయి' డైరీ ప్రారంభించింది. అందులోనే మలాలా షరియత్ చట్టం పేరుతో ఆడపిల్లల చదువును వ్యతిరేకిస్తూ తాలిబాన్లు స్వాత్ లోయలో సష్టిస్తున్న విధ్వంస కాండను తన డైరీ ద్వారా ప్రపంచానికి తెలిపింది. అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు రాలేని వాతావరణాన్ని, నిబంధనలు, నిషేధాలు ప్రపంచానికి తాలిబన్ల క్రూరత్వాన్ని వెల్లడించింది గుల్మకాయి డైరీ. అప్పుడు మలాలాకు పదకుండేళ్ళు.
'నాకు చదువుకునే హక్కుంది
నాకు ఆటలు ఆడుకునే హక్కుంది
నాకూ మాట్లాడే హక్కుంది...'
అంటూ నిత్యం కవితలు రాసుకుంటూ ఎంతో హుషారుగా పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న మలాలాపై అక్టోబర్ 9, 2012న తాలిబాన్లు అతి క్రూరంగా కాల్పులు జరిపారు. మలాల రక్తంతో తడిసిపోయింది. ఆస్పత్రికి చేరింది. యావత్ ప్రపంచం ఆమె క్షేమంకై పరితపించింది. చివరకు లండన్ ఆస్పత్రిలో ప్రాణం పోసుకొని స్పహలోకి వచ్చింది. మళ్ళీ తన గొంతు విప్పింది. ప్రపంచ వేదికలపై మాట్లాడే ఏ అవకాశం వచ్చినా పిల్లల చదువు, ప్రపంచ శాంతి గురించే మాట్లాడుతోంది.
ఆడపిల్లల చదువు కోసం, స్వేచ్ఛ కోసం, ప్రపంచ శాంతి కోసం నిత్యం మాట్లాడే ఆమె, పదిహేడేళ్ళ వయసులో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. 2014లో 'నోబెల్ శాంతి బహుమతి' అందుకుంది. అదే సంవత్సరంలో 'బాలల నోబెల్ బహుమతి' తీసుకుంది. అతి చిన్న వయసులోనే ఆడపిల్లల చదువు కోసం ప్రాణాలకు తెగించిన మలాలా ధైర్యం ప్రపంచ యువతకు స్ఫూర్తి దాయకం. కర్ణాటక హిజాబ్ పోరాటంలో తీవ్రంగా వేదించబడ్డ విద్యార్థిని, తన చదువుకునే హక్కును హరించే హక్కు ఎవరికీ లేదని పోరాడి పీయూసీలో కర్ణాటక స్టేట్ రెండవ ర్యాంక్ సాధించి మలాలా వారసురాలిగా నిలిచింది. ఇలా మలాలా ఎందరికో ఉత్తేజం. కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాదు ప్రతి నిత్యం మలాలాను, ఆమె సాహసాన్ని గుర్తు చేసుకోవాలి. ఆడపిల్లల్ని చదివించాలి. స్వేచ్ఛగా బతకనివ్వాలి.