Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడి, మేక, గొర్రె మాంసాహారులు, పంది, ఎద్దు, ఆవు, అడవి జంతువులు వివిధ రకాల పక్షులు తిని బతుకుతున్న వాళ్ళూ వున్నారు. బెంగాలు ప్రాంతంలో అయితే బ్రాహ్మణులందరూ చేపలు తింటారు. ఇక్కడా, ఇంటి బయట మాంసం తింటున్న బ్రాహ్మలు కోకొల్లలు. మాంసాహారులకు బుద్ధి మాంధ్యము, అనారోగ్యము కలుగుతుందనే సూడో సైన్సును ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రీయ విషయం కాదు. ప్రపంచంలో మాంసాహారులే ఎంతో మంది మేధావులుగా, శాస్త్రవేత్తలుగా వున్నారు. ఇక శాకాహారులు సౌమ్యులు, సాత్వికులని, మానవీయులు అనేది కూడా అబద్ధమే. ఎందుకంటే మానవాళి రక్తాన్ని కళ్ల చూసిన, హతమార్చిన వారిలో ఎక్కువ మంది శాకాహారులే. నియంత హిట్లరు శాకాహారే. ఇక పవిత్రత, అపవిత్రత అనేది మనసుకు సంబంధించినది. ఆహారానికి, శరీరానికి సంబంధించినది కాదు.
'అన్నమయములైనవన్ని జీవమ్ములు, కూడులేక జీవకోటిలేదు' అని కాళికాంబ శతకకర్త వివరిస్తాడు. అన్నము అంటే ఆహారమనే అర్థం. ఆహారపు అలవాట్లు ఆయా ప్రాంతాలు, జీవన విధానాలు మొదలైన వాటిని బట్టి వుంటాయి. ఇది దేశాలకు దేశాలకు మధ్య తేడాలే కాదు, ఒక దేశంలోనూ, ఒక రాష్ట్రంలోనూ భేదాలుంటాయి. ఆహారం కూడా ఒక ఆచారమే. ప్రకృతి ఒనగూర్చే ఒక సూత్రం కూడా. గద్ద పామును తినాలని, పాము కప్పను తినాలని, కప్ప పురుగులను తినాలని ఎవరైనా చెప్పారా, బోధించారా! ఆవుగడ్డి మేస్తుంది, పులి వేటాడి జంతువును తింటుంది. పిల్లికి ఎవరు నేర్పాడు ఎలుకను పట్టి తినాలని! ఇదంతా ఓ పరిణామ క్రమంలో ప్రకృతి ధర్మంగా పరిణమించిన క్రమం. అవసరాలు, అవకాశాలు, అనివార్య పరిస్థితులూ కొన్ని అలవరుస్తాయి. అయితే పశుపక్ష్యాదులు వేరు, మనుషులు వేరు. మనిషి ప్రకృతికి భిన్నంగా, వేరు జరిగి ఒక నాగరికతను తనలోకాన్నీ తయారు చేసుకున్నాడు. బుద్ధినీ అభివృద్ధి చేసుకున్నాడు. రుచినీ అరుచినీ బేరీజు వేసుకున్నాడు. ఇంకా ఇంకా... అధికార, ఆధిపత్యాల సమాజాన్నీ ఏర్పరచుకున్నాడు. మన దేశంలో అయితే కుల, మతాలతో మనుషుల్ని కొలుచుకున్నాడు.
ఆ కొలవటం, ఇప్పుడు ఆహారపు అలవాట్లకూ పాకింది. ఆహారాన్ని బట్టీ ఉన్నతం, నీచం అని లెక్కలు వేయడం పెరిగిపోయి మనుషుల్ని విభజించి వైరుధ్యాలనూ సృష్టిస్తున్నది. ఇది వైషమ్యపూరిత ఆలోచనకూ, రాజకీయ దురుద్దేశాలకు పరికరంగానూ పనికొస్తున్నది. అందులో ముఖ్యంగా శాకాహారము, మంసాహారం అనే విభజనలోంచి రాజకీయాలు, మతమూ, కులమూ, మొత్తంగా వైషమ్యం రెచ్చగొట్టబడుతోంది. వాస్తవంగా ఆహారానికి మతానికి సంబంధం ఉందనుకుంటాం కానీ అవి పరిణామక్రమంలో మార్పులకు లోనయ్యాయి అంతే. ఉదాహరణకు వైదిక మతం అంటే ఇపుడు హిందూ మతమంటున్నారు. వాళ్ళలో కొందరు మాంసాహారులు, మరికొందరు శాకాహారులు. ఇపుడు శాకాహారులనుకునే వారందరి మూల వాసులు మాంసాహారులే. వేదాలలోనే వారి దేవుడైన ఇంద్రునికి, వరుణుడికి లేలేత దూడ మాంసాన్ని నైవేద్యంగా పెట్టినట్లు చదువుకున్నాము. అసలు ఆదిమ మానవుడు, వ్యవసాయానికి, పంట పండించడానికి ముందు, కంద మూలాలు, పండ్లు, కాయలు ఆహారంగా చేసుకున్నాడు. ఆ తర్వాత జంతువుల వేటతో మాంస భక్షణ చేశాడు. పని చేసే శ్రామికులకు సరిపడు శక్తిని కూడా అందించింది ఈ మాంసాహారమే.
ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాంసాహారులే. మన దేశంలోనూ అత్యధికులు మాంసం తింటారు. ఇందులోనూ వివిధ తరగతులున్నాయి. కోడి, మేక, గొర్రె మాంసాహారులు, పంది, ఎద్దు, ఆవు, అడవి జంతువులు వివిధ రకాల పక్షులు తిని బతుకుతున్న వాళ్ళూ వున్నారు. బెంగాలు ప్రాంతంలో అయితే బ్రాహ్మణులందరూ చేపలు తింటారు. ఇక్కడా, ఇంటి బయట మాంసం తింటున్న బ్రాహ్మలు కోకొల్లలు. మాంసాహారులకు బుద్ధి మాంధ్యము, అనారోగ్యము కలుగుతుందనే సూడో సైన్సును ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రీయ విషయం కాదు. ప్రపంచంలో మాంసాహారులే ఎంతో మంది మేధావులుగా, శాస్త్రవేత్తలుగా వున్నారు. ఇక శాకాహారులు సౌమ్యులు, సాత్వికులని, మానవీయులు అనేది కూడా అబద్ధమే. ఎందుకంటే మానవాళి రక్తాన్ని కళ్ల చూసిన, హతమార్చిన వారిలో ఎక్కువ మంది శాకాహారులే. నియంత హిట్లరు శాకాహారే. ఇక పవిత్రత, అపవిత్రత అనేది మనసుకు సంబంధించినది. ఆహారానికి, శరీరానికి సంబంధించినది కాదు.
ఇటీవల మన నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో మాంసాహారాన్ని నిషేధించి, శాకాహారమే తయారు చేస్తామని ప్రకటించటం ఒకింత ఆశ్చర్యం కలుగజేసింది. ఆహారపు అలవాట్లు ఎవరివి వారికి వుంటాయి కానీ ఇతరుల ఆహారపు అలవాట్లు హీనమైనవని అనుకోవడం కించపరచటం తప్పు. ఆహార అలవాట్లను మతానికి కులానికి అంటగట్టి మనుషులను విభజించటమూ మహానేరము. రాష్ట్రపతి భోజనం రాష్ట్రపతి ఇష్టం. కానీ ఆ భవనంలో నిషేధించటం సరికాదు.