Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడి అనేది జైలు కన్నా శిక్షతో కూడుకున్నదిగా ఆ బాలుడు భావించడం ఒక కారణమైతే చంపడం అనే కిరాతకమైన పనికి ఆ వయసులో పూనుకోవడం ఒక విపరీత విషయం. ప్రత్యక్షంగా శత్రువు కానీ వాన్ని హత్య చేయడం తేలికయిన అంశంగా మారడం, సమాజ ఆలోచనలు ఎలా మారిపోతున్నాయో తెలియజేస్తున్నాయి. ఇకపోతనేటి విద్యా వ్యవస్థ ఎంత అపసవ్యంగా అసంబద్ధంగా వుందో కూడా తెలుపుతున్నది. తల్లిదండ్రులకూ పిల్లలపైన వారి ఒత్తిడికి సంబంధించిన విషయం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. పిల్లల మానసిక పరిస్థితిని, వారి అభిరుచులు, ఆసక్తులను గమనించి అందులోనే ప్రోత్సహించాల్సిన తల్లిదండ్రులు, అవేమీ పట్టించుకోకుండా తమ ఆశలను, కోరికలను వారిపై రుద్దడమూ ఈ పరిస్థితులకు కారణమే. బడులు, బోధనా పద్ధతులు కూడా విద్యార్థులకు ఆసక్తిని, విశ్వాసాన్ని కలిగించే విధంగా లేవన్నది అక్షరాల సత్యం.
ఈ రెండు మాటలూ చాలా అరుదుగానే వినేవాళ్ళం మా చిన్నతనంలో. ఇవి చిన్న పిల్లల్లోనూ జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఆత్మహత్య కూడా ఒక రకమైన హత్యనే. చిన్నచిన్న విషయాలకే హత్యలూ ఆత్మహత్యలు నేడు పెరిగిపోతున్నాయి. ఇక నేటి ఆధునిక జీవన శైలిలో మానసిక ఒత్తిడి పెరిగి నిస్సహాయతకు లోనై మనో బలిమి సన్నగిల్లుతున్నది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ఇంత బలహీన పడిపోవడం యాభై ఏండ్ల క్రితం అంతగా లేదు. మానసిక వైద్యులు చాలా కారణాలను వివరిస్తున్నారు. ఇటీవల కౌన్సిలింగ్ కేంద్రాలు కూడా ఎక్కువగానే వెలిసాయి. ఇవేవీ కారణాల జోలికి వెళ్ళవు కానీ, తాత్కాలిక ఉపశమనాలను కలిగిస్తాయి.
ఇటీవల కాలంలో బాలల్లోనూ ఈ సమస్య పెరుగుతోంది. దీనికీ కారణాలను వెతకాలి. మొన్నా మధ్య ఢిల్లీ దగ్గర నోయిడాలో పద్నాలుగేండ్ల బాలుడు, ఇంకో బాలున్ని హత్య చేశాడు. అతడు చెప్పిన కారణము వింటే ఆశ్చర్యమే కాదు, ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. హత్య చేసాడనే కారణంగా జువైనల్ జైలులో వేస్తారు. అలా జైల్లో పడిపోతే బడికి వెళ్లే పని వుండదని భావించి తోటి విద్యార్థిని హత్య చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అంటే బడి అనేది జైలు కన్నా శిక్షతో కూడుకున్నదిగా ఆ బాలుడు భావించడం ఒక కారణమైతే చంపడం అనే కిరాతకమైన పనికి ఆ వయసులో పూనుకోవడం ఒక విపరీత విషయం. ప్రత్యక్షంగా శత్రువు కానీ వాన్ని హత్య చేయడం తేలికయిన అంశంగా మారడం, సమాజ ఆలోచనలు ఎలా మారిపోతున్నాయో తెలియజేస్తున్నాయి. ఇకపోతే నేటి విద్యా వ్యవస్థ ఎంత అపసవ్యంగా అసంబద్ధంగా వుందో కూడా తెలుపుతున్నది. తల్లిదండ్రులకూ పిల్లలపైన వారి ఒత్తిడికి సంబంధించిన విషయం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. పిల్లల మానసిక పరిస్థితిని, వారి అభిరుచులు, ఆసక్తులను గమనించి అందులోనే ప్రోత్సహించాల్సిన తల్లిదండ్రులు, అవేమీ పట్టించుకోకుండా తమ ఆశలను, కోరికలను వారిపై రుద్దడమూ ఈ పరిస్థితులకు కారణమే. బడులు, బోధనా పద్ధతులు కూడా విద్యార్థులకు ఆసక్తిని, విశ్వాసాన్ని కలిగించే విధంగా లేవన్నది అక్షరాల సత్యం.
ఇక మన హైదరాబాదు హయత్నగర్లో పాఠశాలలో ఒక విద్యార్థినిని ఉపాధ్యాయుడు, శిక్ష పేరుతో బయట కొన్ని గంటల పాటు నిలబెట్టాడు. ఆ అమ్మాయి దాన్ని అవమానంగా భావించి ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉపాధ్యాయుడు ఏ శిక్షయైనా తరగతి గదిలోనే ఉండాలి. తరగతి బయట నిలబెట్టడం తప్పు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల మనస్తత్వాలను అధ్యయనం చేసి వ్యవహరించాలి. ఆ రకమైన శిక్షణ ఉపాధ్యాయులకు లేదు. ప్రయివేటు ఉపాధ్యాయులకు మరీ శూన్యం. ఇక ఈ విషయానికే అంత చిన్న బాలిక ఆత్మహత్యకు పూనుకోవటం ఏమిటి! ఏ రకమైన ఆలోచనలను మన సమాజం భావి తరాలకు అందిస్తోంది! ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా పెరుగుతున్నాయి.
ఇది కేవలం వ్యక్తిగతమైన సమస్య కాదు. సామాజిక పరమైనది. కుటుంబం, పరిసరాలూ ఇలాంటి మానసిక స్థితికి కారణాలు. సమాజ పరంగా పెరుగుతున్న ఆర్థిక, మానసిక వొత్తిడి పర్యావసానాలు ఇవి. ఓటములకు, బలహీనతలకు తమకు తామే కారణమనుకునే భావన ప్రతి వారిలోనూ చోటు చేసుకుంది. కానీ వీటికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒక సమగ్ర ఆలోచనలకు, విశ్వాసాన్ని ఈ వ్యవస్థ ఇవ్వడం లేదు. మానవ సంబంధాలూ అడుగంటిపోయి, ఒంటరినయ్యాననే భావన మనుషుల్లో పెరుగుతోంది. వీటిని పరిష్కరించగలిగితేనే భావితరం విశ్వాసంతో మనగలుగుతుంది.