Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెజ్జూర్
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘం అధ్యక్షుడు ఐసీ శ్రీ కుర్సింగ ఓం ప్రకాష్ అధ్యక్షతన మహాజన సభ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఆదాయ వ్యయాలు పరిశీలించి తీర్మానించారు. సంఘంలో పేరుకుపోయిన మొండి బకాయిలు వసూలు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ డీఆర్‌ను కోరుతూ ఆమోదించి, సంఘంలో ఇప్పటివరకు ప్యాక్స్ పరిధిలోని గ్రామాలకు 400 టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. సంఘంలో చేరిన నూతన సభ్యుల సభ్యత్వాలను పరిశీలించి వారికి పంట రుణాలు ఇచ్చేందుకు, మండలంలోని బారెగూడ గ్రామంలో మరో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డీసీఓ తారమణిని కోరారు.ఈ సందర్భంగా డీసీఓ తారమణి మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేయడంలో సిబ్బందికి సహకరించి సంఘాన్ని విజయబాటలో నడిపించాలని కోరారు. సంఘం అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు, సిబ్బంది తమవంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీఓ తారమణి, మేనేజర్ తిరుపతి, సిబ్బంది వెంకటేశ్వర్‌గౌడ్, సంజీవ్‌కుమార్, ఎడ్ల మహేష్, గుమ్ముల శ్రీనివాస్, దేవాజీ, మండల సహకార సంఘం డైరెక్టర్లు పుల్లూరి మనీషా సతీష్, గట్టు లలిత, సిర్పూరం శకుంతల, బొయిరె భీమన్న, పేదం శ్రీహరి, తెలి బాపు, మేకల కోటేష్, పాముల వెంకటి, రైతులు నికాడి రామయ్య, ఏలేశ్వరం వెంకటయ్య, బాషీర్ఖాన్ పాల్గొన్నారు.