Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మెన్ భోజారెడ్డి
- మావల ఎంపీపీగా దర్శనాల సంగీత
నవతెలంగాణ-ఆదిలాబాద్ రూరల్
మావల ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మావల ఎంపీపీగా కొనసాగిన చందాల ఈశ్వరి, రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది, శుక్రవారం ఎంపీపీ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా రఫత్ అలీ, ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపీపీగా దర్శనాల సంగీతకు వాఘాపూర్ ఎంపీటీసీ చందాల ఈశ్వరి ప్రతిపాదించగా మావల ఎంపీటీసీ అట్ల గోవర్ధన్ రెడ్డి బలపరిచారు. ఎంపీపీ ఎన్నిక బరిలో ఎవరు నిలవకపోవడంతో ఏకగ్రీవంగా మావల ఎంపీపీగా దర్శనాల సంగీత ఎవన్ ఎన్నికయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం నియామక పత్రాన్ని అందచేశారు, సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలని డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీకి పుష్పగుచ్ఛాన్ని అందించి, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్ల వనిత, ఎంపీడీఓ అరుణ, తహసీల్దార్ వనజా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.