Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామకృష్ణాపూర్
ఆర్కే 1ఏ గని కాల పరిమితి పెంచాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారమయ్య అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్‌కి వచ్చిన సింగరేణి డైరెక్టర్ బలరాంకు ఏఐటీయూసీ అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆర్కే 1ఏ గనిలో 10 సంవత్సరాలకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. గనిలో పని చేసే కార్మిక కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డారని, వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గనిని కొనసాగించాలని డైరెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఏరియా బ్రాంచి కార్యదర్శి ఎండీ.అక్బర్ అలీ, ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఆర్ కే1ఏ గని ఫిట్ సెక్రటరీ సురమళ్ళ వినయ్ కుమార్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గోవిందుల రమేష్ పాల్గొన్నారు.