Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్‌అర్బన్
జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆదివారం కేవీపీఎస్ 24వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పవర్ జితేందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌తో కలిసి జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవీపీఎస్ 1998లో ఆవిర్భవించిందని ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలుగా చేసుకుందన్నారు. అందుకోసమే నిరంతరాయంగా పోరాడుతుందని అన్నారు. అనతి కాలంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సాధించి జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందన్నారు. వివక్షకు వ్యతిరేకంగా, దళితుల హక్కుల సాధన కోసం పోరాడుతోందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగంపై దాడి చేస్తూ, రిజర్వేషన్లను తొలగించే కుట్ర చేస్తుందని మండి పడ్డారు. భారత రాజ్యాంగాన్ని కాపాడు కోవడానికి యువత సిద్దపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, ఎం.గంగన్న, ప్రజాసంఘాల నాయకులు ఎ.కిరణ్, అనిల్, బండి దత్తాత్రి, లోకారి పోశెట్టి, ఆర్ సురేందర్ పాల్గొన్నారు.