Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాహామైన 10 నెలలకే తనువు చాలించిన యువతి
నవతెలంగాణ-కౌటాల
అత్తగారి ఇంటికి వచ్చిన కోడలకు వేదింపులు ఎక్కువయ్యాయి. కట్టుకున్న భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా వేదించడంతో వివాహామైన పది నెలలకే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సీఐ బుద్దె స్వామి, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కౌటాల మండల కేంద్రానికి సమీపంలోని శివలింగాపూర్‌కు చెందిన డోంగ్రె ప్రహ్లాద్-లహనుబాయికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు వీరిలో రెండో కూతురు సంధ్య(20) మండలకేంద్రానికి చెందిన వీఆర్ఏ రౌతు రేవంజీ కుమారుడు రౌతు జయంత్‌కు ఇచ్చి గతేడాది నవంబర్ 14న వివాహాం చేశారు. వివాహామైన తర్వాత కొద్ది రోజుల పాటు అత్తగారి ఇంటిలో ఉన్న సంధ్య గొడవల కారణంగా రెండు నెలలు తల్లిగారింటికి వెళ్లింది. ఆ తర్వాత తల్లిదండ్రులు వద్దని నచ్చజెప్పడంతో అత్తగారింటికి వెళ్లింది. తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినా స్వచ్ఛతగా ఉండేవారు కాదు. ఈ క్రమంలో దసరా పండుగ కోసం నాలుగు రోజుల క్రితం సంధ్య, జయంత్‌లు కౌటాలకు వచ్చారు. ఆ తర్వాత ఇంటిలో గొడవలు ఎక్కువయ్యాయి. సూటిపోటీ మాటలతో భర్త, అత్తామామలు సంధ్యను వేదించడంలో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆదివారం ఉదయం సంధ్య భర్త అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అత్తమామ, భర్త మాటలతో మనస్తాపం చెంది పురుగుల మందుతాగింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే సిర్పూర్ సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి చేస్తున్నట్టు సీఐ బుద్దె స్వామి తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ కరుణాకర్ సిర్పూర్ సామాజిక ఆస్పత్రికి చేరుకొని పరిశీలించారు. ఆయన వెంట సిర్పూర్ ఎస్సై రవికుమార్ ఉన్నారు.