Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్
నవతెలంగాణ-ఉట్నూర్
లంబాడాలను ఎస్టీ జాబిత నుండి తొలగించాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని దొంగచింత గ్రామంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యధర్శి పుర్క బాపురావ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధత లేని లంబాడలను ఎస్టీ జాబిత నుండి తొలగించాలని గత కొన్నేండ్లుగా ఉద్యమాలు చేపడుతునే ఉన్నామని అన్నారు. అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకోవడం లేదని ప్రభుత్వాలను విమర్శించారు. పోడు భూములను సాగుచేస్తున్న ఆదివాసులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున ఉట్నూర్ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ఏజెన్సీలో పేసా, 1/70, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, సుప్రీం కోర్టు రద్దు చేసిన జీఓ నెం. 3ను యధావిధిగా అమలు చేయాలని, ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక డీఎస్సీని నిర్వహించి, ఆదివాసీ యువతి, యువకుల చేతనే ఉద్యోగ నియమకలను చేపట్టాలన్నారు. నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామలుగా గుర్తించాలని, భారీ వర్షల మూలంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వెంటనే ఏఎన్ఎంలను నియమించాలన్నారు. అంతకుముందు గ్రామంలో ఉన్న కుమురం సూరు, కుమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
తాంసి:చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు భరత్ అన్నారు. శుక్రవారం ఆదివాసీ, గిరిజన గూడల్లో తుడుం దెబ్బ పిలుపు మేరకు గ్రామంలోనే ఒక రోజు నిరసన దీక్షలు చేయాలన్న పిలుపులో భాగంగా మండలంలోని అంబుగాం గ్రామంలో కుమురం భీం విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బగా అయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు, గ్రామ పటేళ్లు, సార్మీడిలు, మహిళా, విద్యార్టీ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కార్మిక కర్షక వర్గాల ప్రజలు, పెద్ద ఎత్తున ఆదివాసీ గూడాల్లో ఒక రోజు నిరసన దీక్షలు చేపట్టారు. చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ, జాబిత నుండి తొలగించాలని డియాండ్ చేశారు. ఆదివాసులు సాగుచేస్తున్నా అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. పేసా, 1/70, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. గిరిజన యూనివర్సిటీని అదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, పోచ్చిరాం, మల్కుపటేల్, చంద్రశేఖర్ ఉన్నారు.