Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయం అంతే.. ఖర్చూ అంతే..
నవ తెలంగాణ-మోత్కూర్
మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ను 2021-22 సంవత్సరానికి గాను మోత్కూర్ మున్సిపాలిటీకి రూ.రూ.7 కోట్లా 37 లక్షలా 96 వేల ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఖర్చూ అంతే ఉంటుందని అధికారులు లెక్కలు వేశారు. బడ్జెట్ ఆమోదం కోసం బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. చైర్మెన్్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.7 కోట్లా 37 లక్షలా 96 వేలతో కౌన్సిల్ లోబడ్జెట్ ప్రవేశపెట్టగా పన్నుల ద్వారా రూ.72.26 లక్షలు, అసైన్డ్ రెవెన్యూ రూ.50 లక్షలు, రెంటల్ 22.10 లక్షలు, పారిశుద్ధ్య విభాగం ద్వారా రూ. 15 లక్షలు, పట్టణప్రణాళిక నుంచి రూ.1.53 కోట్లు, ఇంజనీరింగ్ విభాగం ద్వారారూ.19.60 లక్షలు, డిపాజిట్, లోన్స్ నుంచి రూ.5లక్షలు, 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1.50 కోట్లు, స్టేట్ పైనాన్స్ నిధులు రూ.1.31 కోట్లు, స్వచ్చ భారత్ కింద రూ.5 లక్షలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం రూ.కోటి, మెప్మా నిధులు రూ.5 లక్షలు, జనాభా లెక్కల నిధుల కింద రూ.10 లక్షలఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఖర్చుల కింద సిబ్బంది జీతాలకు రూ.ఒక కోటి 18 లక్షలు, పారిశుధ్య నిర్వహణకు రూ.47.70లక్షలు, కరెంట్ బిల్లుల చెల్లింపుకు రూ.40.50 లక్షలు, హరితహారం కోసం రూ.61.29 లక్షలు, వాటర్ సప్లరు, ఇంజనీరింగ్ నిర్వహణకు రూ.68.50 లక్షలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు రూ.26.81 లక్షలు, పట్టణప్రణాళి కకు రూ.2 లక్షలు, బలహీన వర్గాల అభివద్ధి కోసం రూ.1.52 లక్షలు, ప్రజా సౌకర్యాల కల్పనకు రూ.లక్ష, వార్డుల వారీ ఖర్చులు రూ.2.05 లక్షలు, డిపాజిట్, రుణాల చెల్లింపునకు రూ.5 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 కోట్లు, స్టేట్ పైనాన్స్ నిధులు రూ.1.81 లక్షలు, స్వచ్చ భారత్ కు రూ.5 లక్షలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ.కోటి, మెప్మా నిధులు రూ.5 లక్షలు, జనాభా లెక్కల నిధులు రూ.10 లక్షలు కాగా మొత్తం రూ.7 కోట్ల 37 లక్షల 96 వేల ఖర్చుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, కమిషనర్ షేక్ మహమూద్, మేనేజర్ ప్రభాకర్, టీపీవో వీరస్వామి, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, కారుపోతుల శిరీష, ఎర్రవెల్లి మల్లమ్మ, లెంకల సుజాత, మలిపెద్ది రజిత, వనం స్వామి, దబ్బెటి విజయ, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, కవిత, కుమారస్వామి, కోఆప్షన్ సభ్యులు నర్సింహ, ఆనందమ్మ, తదితరులు పాల్గొన్నారు.