Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశంలో అడిగిన రిపోర్టును వచ్చే సమావేశంలో అప్డేట్ అయ్యేలా చూడాలి
- జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రధాన రోడ్డు మార్గంలో ధ్వంసమైన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. బుధవారంస్థానిక జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో 1,7 (ఆర్థిక , పనులు)వ స్థాయి సంఘాలుసమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచంపల్లి గోకారం, మర్యాల- చీకటిమామిడి, మోత్కూర్, వలిగొండ రోడ్లలో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు రోడ్ల పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ సిహెచ్ కష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు కోట పుష్పలత మల్లారెడ్డి, గొరుపల్లి శారద వెంకటరెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, అధికారులు శంకరయ్య, సూపరింటెండెంట్ యాదగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండవ స్థాయి సమావేశం (గ్రామీణ అభివద్ధి )పై జిల్లా పరిషత్ చైర్మెన్ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన రెండవ స్థాయి సంఘం సమావేశంలో గ్రామీణ అభివద్ధి పనులపై చరించారు.ఈ సందర్భంగా గ్రామీణ అభివద్ధి శాఖ నుంచి అధికారి మాధవి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న అభివద్ధి పనులపై రిపోర్ట్ ను చదివి వినిపించారు.జెడ్పీచైర్మెన్ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్యక్రమంలో చేపడుతున్న ఫారం పాండ్స్ ఇలాంటి లేబర్ కాంపోనెంట్ వర్క్‌ను ఎక్కువగా చేయాలని సూచించారు. పశువుల షెడ్డు, రైతులకు కల్లలు ఇలాంటి మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ ఎక్కువగా చేయడంతో బిల్లులు ఆ గాయని అభిప్రాయపడ్డారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ లో ఎక్కడెక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశారని, రుణ సౌకర్యం పై ఆరా తీశారు.ఈ సమావేశంలో అడిగిన ప్రతి రిపోర్టును వచ్చే సమావేశంలో అప్డేట్ అయ్యేలా చూడాలని అధికారులను కోరారు.