Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విభజనతో ఆంధ్రాకు అన్యాయం
- ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయం
- జగన్‌ది చేతల ప్రభుత్వం.. కేసీఆర్‌ది మాటల ప్రభుత్వం
- విలేకర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మెన్ నందమూరి లక్ష్మీపార్వతి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో వాటా ప్రకారం ఆంధ్రాకు రావాల్సిన 58 శాతం ఆస్తులను కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మెన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. హైదరాబాద్ వెళ్తూ మార్గ మధ్యలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామ పరిధిలోని నాగార్జున ఫుడ్ ప్లాజ వద్ద విలేకరులతో మాట్లాడారు .ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం రాజకీయ చరిత్రలోనే అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతల ప్రభుత్వమన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భూస్థాపితం చేస్తున్నారన్నారు. టీడీపీలోని సీనియర్ నాయకులు యువతరం పార్టీ బాధ్యతలు చేపట్టాలనే మాటలు చంద్రబాబుపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానపరుస్తూ, అవసరం వచ్చినప్పుడు వాడుకొని ,అవసరం తీరాక పక్కన పెట్టడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు చేపట్టరని జోస్యం చెప్పారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ వెనుక ఎవరి హస్తం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పుడు మాత్రమే అభివద్ధి జరిగిందని తెలిపారు. కెేసీిఆర్ ఒక్క కొత్త అభివద్ధి పని చేపట్టలేదన్నారు. హైదరాబాదుకు వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివద్ధి పనులు అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని దూరం చేసుకోవడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన కూడా ఆ పార్టీకి నష్టమే చేకూర్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివద్ధి కోసం మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉంటున్నారు తప్ప ఎలాంటి పొత్తు లేదని తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు.