Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగిక దాడి చేసి హత్య చేశారా..?
- చౌటుప్పల్ మండలంలో సంఘటన
నవతెలంగాణ -చౌటుప్పల్రూరల్
గుర్తుతెలియని బాలిక అనుమానస్పదంగా మతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది .సీఐ నేతి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దివిస్ పరిశ్రమ వెనకవైపు ఆరెగూడెం గ్రామ పరిధిలో ఓ గుర్తు తెలియని బాలిక మృతదేహం ఉన్నట్లు గొర్రెల కాపరులు సమాచారం ఇచ్చారు. రెండు మూడు రోజులుగా మానసిక వికలాంగులైన ఓ మహిళ వెంట ఓ బాలిక తిరిగినట్లు స్థానికులు తెలిపారు. బాలిక వయసు ఐదేళ్లలోపు ఉంటుందని నిర్ధారించారు. దివిస్ పరిశ్రమ వెనకవైపు వ్యవసాయ భూముల్లో బాలిక మృతదేహం ఉండటం పట్ల పలు సందేహాలు తలెత్తుతున్నాయి. బాలికని ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా ? లేక దుండగులు బాలికను అపహరించి హత్య చేశారా ? అన్న పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మానసిక వికలాంగులైన మహిళల జాతీయ రహదారి నుండి సుమారు రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్లే అవకాశం లేదని అని పలువురు అంటున్నారు .బాలిక మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.