Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.63.95 కోట్లతో ప్రణాళిక
నవతెలంగాణ-మిర్యాలగూడ
2021- 22 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్ పాలకవర్గం వార్షిక బడ్జెట్ను ఆమోదించింది. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ తిరునగరు భార్గవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూ.63.95 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల వివరాలను ఏజెండాలో రూపొందించగా వాటిని సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ కుర్ర కోటేశ్వరరావు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.