Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం పాలనలో బంగారు తెలంగాణ కాదు ..బాధల తెలంగాణ అయిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ విమర్శించారు. మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో జన చైతన్య పాదయాత్రలో సభలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాలకు సమభావన సంఘాలకు పొదుపు డబ్బులు ఇవ్వడంలేదన్నారు. వడ్డీ డబ్బులు సుమారు రూ.20 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు . కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అభయ హస్తం పథకాన్ని కేసీఆర్ ఎత్తివేశారన్నారు. జిల్లా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేక వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎర్రజెండా పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన గెలిపించకపోయినా పేద ప్రజల అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం రథసారధి ఎండి జహంగీర్, కొండమడుగు నరసింహ ,మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,రమేష్ నాయక్ ,పార్టీ సీనియర్ నాయకులు గూడూర్ అంజిరెడ్డి, లింగారెడ,ి్డ వెంకటేశం, కోట రామచంద్రారెడ్డి , ప్రసాద విష్ణు, మధు ,బుచ్చి రెడ్డి, మార్తా సత్యనారాయణ, బిక్షపతి, అశోక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.