Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించే వాళ్లను అణగదొక్కుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- పాదయాత్ర రథసారధి ఎమ్‌డి.జహంగీర్
నవతెలంగాణ - భూదాన్‌పోచంపల్లి
కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్లను అనగదొక్కుతున్నారని పాదయాత్ర రథసారధి ఎండి. జహంగీర్్ అన్నారు. బుధవారం పట్టణకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లా సమగ్రాభివద్ధి కోసం చేపట్టిన జన చైతన్య పాదయాత్ర రామన్నపేటలో ప్రారంభమై చౌటుప్పల్ , సంస్థాన్‌నారాయణపురం, పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో 9వ రోజు పాదయాత్ర 57 గ్రామాలు 207 కిలోమీటర్లు సాగిందన్నారు. ఈ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందన్నారు సమస్యలు పాదయాత్ర దష్టికి తీసుకు వచ్చారన్నారు టీిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వలేని పరిస్థితి అన్నారు. రేషన్ కార్డుకు కోసం ఇప్పటివరకూ 8500 దరఖాస్తుల పాదయాత్ర బదానికి పేదల అందజేశారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 5500దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇండ్ల స్థలాలు నుండి వ్యక్తిగత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 4వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి మండలానికి వంద పడకల ప్రభుత్వాస్పత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను సీఎం కేసీర్ మొదట్లో వ్యతిరేకించి ఢిల్లీకి వెళ్లి మోడీ అమిత్ షాలను కలిసిన తర్వాత యూటర్స్ తీసుకున్నారన్నారు. పాదయాత్ర బదం సభ్యులు కొండమడుగు నరసింహ మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం అనురాధ కోమటిరెడ్డి చంద్రారెడ్డి రమేష్ నాయక్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి లింగారెడ్డి వెంకటేశం చంద్రారెడ్డి ప్రసాద్ విష్ణు మధు తదితరులు పాల్గొన్నారు