Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర బృందం సభ్యుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
కార్మిక ,కర్షక ,యువత, విద్యార్థి, మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. జన చైతన్య పాదయాత్రలో భాగంగా బుధవారం మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన 44 కార్మిక చట్టాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు అడుగుల విభజించి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్కు పీఆర్సీ వర్తింపజేయాలని కోరారు. పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు పరిశ్రమల యజమానులు కాలుష్యం నియంత్రణ చర్యలను చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలో డీసీఎల్ పోస్టులను భర్తీ చేయాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీఎఫ్ఎన్ఫోర్స్ మెంట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. కనీస వేతనం రూ.21000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య పాదయాత్ర రథసారధి ఎండి. జహంగీర్ ,పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నరసింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, రమేష్ నాయక్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు అంజిరెడ్డి, గూడూరు బుచ్చిరెడ్డి ,మార్త సత్యనారాయణ, జ్యోతి లింగారెడ్డి ,వెంకటేశం, రామచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు, మధు తదితరులు పాల్గొన్నారు.