Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాల అమ్మేందుకు కుట్ర
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవ తెలంగాణ -భూదాన్ పోచంపల్లి
దేశంలో బీజేపీ మతాలను రెచ్చగొట్టి పరిపాలన సాగిస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. జన చైతన్య పాదయాత్ర 8వ రోజు మంగళవారం 54 గ్రామాలు 192 కిలోమీటర్లు పూర్తి చేసుకొని పోచంపల్లి పురపాలక కేంద్రంలో అడుగు పెట్టింది. రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెరుపల్లి మాట్లాడుతూ విదేశాలు తిరిగి వచ్చి గొప్ప పాలన అందిస్తున్నామని చెబుతున్నా మోడీ ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు . అంబానీ,అదానిలకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి సంపదను దోచిపెడుతున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. దేశ సంపద గుజరాతి మరాఠీలకు అప్పజెప్పే ఎందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆరేండ్లు పూర్తయిన ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కరోనాతో పేద ప్రజలు మరింత పేదలుగా మారారని ఆరోపించారు. కరోనా వైరస్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి ప్రతి ఒక్కరు టీక వేయించుకోవాలని సూచించారు . రాజ్యాంగ హక్కులను లాక్కుని విధంగా బీజేపీ పాలన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు నెలల నుండి వేలాదిమంది రైతులు ధర్నా చేస్తుంటే సుమారు 250 మంది రైతులు చనిపోయినప్పటికీ స్పందించడంలేదన్నారు. ఆంధ్ర పాలకుల చేతిలో నీళ్లు, నిధులు నియామకాల విషయంలో తెలంగాణ అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించిన తెలంగాణలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
రజాకార్లను దేశ్ ముఖి లను ఎదిరించిన పోరాటంలో ఎందరో తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. ప్రజలను విముక్తి చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు తెలంగాణ ప్రాంతానికి ఉందన్నారు . భూమికోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. కమ్యూనిస్టులు పేద ప్రజల కోసం ప్రజలను చైతన్య పరచడం నిరంతరం ప్రజల మధ్యనే ఉంటారన్నారు .కొన్ని పార్టీలు ఓట్ల కోసమే వస్తూపోతూ ఉంటాయన్నారు. చేనేత కార్మికులకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని చేనేత కార్మికులను ఆదుకోవాలని కార్మికులకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి సిరిసిల్ల నేత బజారు వ్యాపారాలతో ఏ విధంగా కళకళలాడుతుంది పోచంపల్లి ని కూడా అదే తరహాలో మాదిరిగా ్ల మార్కెట్ సదుపాయం కల్పించి చేనేత కార్మికుల వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య పాదయాత్ర రథసారధి ఎండి .జాంగిర్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం , బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి గిరిజన సంఘం జిల్లా నాయకులు రమేష్ నాయక్, సీనియర్ నాయకులు గూడూర్ అంజిరెడ్డి ,మండల కార్యదర్శి లింగారెడ,ి్డ ,పట్టణ మున్సిపల్ కార్యదర్శి గడ్డ వెంకటేశం పార్టీ కోట రామచంద్రారెడ్డి డి సీనియర్ నాయకులు కోడి బాల్ నరసింహ ప్రసాదం విష్ణు ,మంచాల మధు, చిలువేరు లాలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు