Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నివారణలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలి
- కలెక్టర్ అనితా రామచంద్రన్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
పోలీసు రెవెన్యూ ,వైద్య ఆరోగ్య శాఖ మండల అభివద్ధి అధికారులు పరస్పర సహకారంతో కోవిడ్ ఉధతిని అరికట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. బుధవారం కలెక్టర్ కోవిడ్ ఉద్ధతి పై వైద్య ఆరోగ్య శాఖ తో పాటు అనుబంధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ తొలిదశలో ఏవిధంగానైతే నివారణ చర్యలు చేపట్టారో, రెండవ కోవిడ్ ఉదతిని కూడా అదే స్ఫూర్తితో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి అరికట్టాలని సూచించారు. కొద్దిపాటి జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారిని గుర్తించి , కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపి, ప్యాకేజీ కేసులను 14 రోజులపాటు హౌమ్ క్వారంటైన్ చేయాలని, వారికి తగిన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రేపటి నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ టీకాలు వేయాలనానరు. పోలీసులు భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.