Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సెగ్రిగేషన్ షెడ్లను ఏప్రిల్ 15వ తేదీ లోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీల నిర్వహణ, లేబర్ టర్నవుట్, సర్వైవల్ కాప్చర్, పల్లె ప్రకృతి వనంలపై మండలాల వారీగా సమీక్షించారు. అనంతరం రాహుల్ శర్మ మాట్లాడుతూ పూర్తి చేసిన అన్ని సెగ్రిగేషన్ షెడ్లలో ఏప్రిల్ 20లోపు కంపోస్టు తయారు చేయాలని ఆదేశించారు. సెగ్రిగేషన్ షెడ్ పూర్తయిన ప్రతి గ్రామపంచాయతీలోనూ చెత్తను సెగ్రిగేట్ చేయాలని కోరారు. ప్రతి గ్రామపంచాయతీలో రేపటి నుండి 100 మంది కూలీలు ఉపాధి పనికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వచ్చేవారం లోపు అన్ని నర్సరీల్లోనూ సీడ్ సోయింగ్ ప్రైమరీ బెడ్లు పూర్తి చేసి పేమెంట్లు చేయాలన్నారు. పూర్తైన అన్ని పల్లె ప్రకృతి వనాలకు వచ్చేవారంలోపు చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో వై.శేఖర్‌రెడ్డి, డీపీవో విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.