Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ట్రాక్టర్ టైరు పేలి కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం కేతెపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..కొర్లపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్ ట్యాంకర్ యజమాని సైదులు సమీపంలో ఉన్న గ్రామ శివారులో ఉన్న క్రషర్ కంపెనీలో నీళ్లు పోసేందుకు వెళ్లాడు.ఆ కంపెనీలో పనిచేసే కార్మికుడు చౌదరి తనకు నీరు పోయాలని ట్రాక్టర్ యజమానిని అడిగాడు. ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ టైర్లలో గాలి తక్కువగా ఉందని యజమాని చెప్పాడు.సమీపంలో గాలి మిషన్ ఉందని, తాను ఎక్కిస్తానని చెప్పి గాలి పెడుతుండగా టైరులో గాలి ఎక్కువై పేలి పోయింది. ఈ క్రమంలో ట్రాక్టర్ టైర్లో ఉండే డిస్క్ చౌదరి కడుపులో బలంగా తగలడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. మతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్ కు చెందిన వాడు గా గుర్తించారు. మతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు.