Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ ఆర్.భాస్కరన్
నవతెలంగాణ-సూర్యాపేట
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జిల్లాలో ద్విచక్ర వాహనదారుల వల్లే సంభవిస్తున్నాయని ఎస్పీ ఆర్.భాస్కరన్ వెల్లడించారు.అందుకు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయనడానికి రోడ్డు ప్రమాద గణాంకాలు తెలుపుతు న్నాయన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారన్నారు.ఇందుకు గాను ద్విచక్ర వాహనాలను సురక్షితంగా నడపడంలో భాగంగా జిల్లావ్యాప్తంగా వాహనాన్ని నడిపే ప్రత్యేకతను నిర్వహించి రోడ్డు భద్రత,వాహన చట్ట నిబంధనలు పాటించని ద్విచక్ర వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు రోడ్డు ప్రమాద గణాంకాలను పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా 96 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు.ఈ ప్రమాదాల్లో 62 ద్విచక్ర వాహనాలు ప్రమాదాలేనని స్పష్టం చేశారు.జిల్లాలో రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగినా ద్విచక్రవాహనం ఒకటి ఖచ్చితంగా ఉంటుందని వివరించారు.ఈ ఏడాది రెండునెలల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో 42 మంది మరణించగా 27 మంది ద్విచక్ర వాహన దారులు మత్యువాత పడ్డారని తెలిపారు.నెంబర్ ప్లేట్‌లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై చట్ట పరమైన చర్యలకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు.ప్రభుత్వ ఆదేశానుసారం కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు.బహిరంగ ప్రదేశాలు, షాపింగ్‌మాల్స్, వివిధ మార్కెట్ల వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని సూచించారు.ప్రతి ఒక్కరూ సామాజికదూరం పాటించాలన్నారు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.