Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఉధతమైన ప్రజాఉద్యమాలకు సీపీఐ(ఎం) శ్రీకారం చుట్టనున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీతారామ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి ఒక్కరోజు శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు రెడ్డి మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడేండ్లవుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.ప్రజలు 70 ఏండ్ల కాలంలో వివిధ పార్టీలకు ఓట్లు వేసి విసుగుచెందారన్నారు.రానున్న రోజుల్లో ప్రజలు కమ్యూనిస్టులకు పట్టం కట్టడం ఖాయం జోస్యంచెప్పారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనన్నారు.జిల్లాలో అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు.సమస్యల పరిష్కారం కోసం సీపీఐఎం బలమైన ప్రజాఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదచర్యలకు పాల్పడుతూ దేశంలో అశాంతికి కారణ మవుతుం దన్నారు.పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేద,సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతోందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు మూలంగా దేశానికి తిండి పెట్టే రైతన్న అన్నమో రామచంద్రా అని అల్లాడి పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో మేకన బోయిన శేఖర్, ములకలపల్లి రాములు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, కోటగోపి, మట్టి పెళ్లి సైదులు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న ,నాయకులు వీరబోయినరవి, మేకనబోయిన సైదమ్మ, గుద్దేటి చిన్నవెంకన్న పాల్గొన్నారు.