Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్
నవతెలంగాణ -భువనగిరి రూరల్
భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్న ఏరియా ఆస్పత్రిల్లో గర్భిణుల డెలివరీల సంఖ్య ఎక్కువ తక్కువ కాకుండా కచ్చితమైన సమాచారాన్ని అంకెలతో సహా చూపించాలని కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్ కోరారు. గురువారం జెడ్పీ కార్యాలయంలో సమావేశ మందిరంలో నాల్గవ స్థాయి సంఘ సమావేశం (విద్య, వైద్యం) సమావేశం నగేష్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా మలేరియా, పాము కాటు, కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో శిశు మరణాలు ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయని, మరణాల సంఖ్యను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.భువనగిరి లోని ఏరియా ఆసుపత్రి లో కరోనా పరీక్షా కేంద్రం వద్ద టెంటు సౌకర్యం కల్పించాలని, నీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలేరు ఏరియాస్పత్రిలో గర్భిణులకు ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవాలు గురించి అవగాహన కల్పించేందుకు సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
మధ్యాహ్నం 5 వ స్థాయి సంఘ సమావేశం : జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 5వ స్థాయి సంఘ సమావేశం ( మహిళ శిశు సంక్షేమ శాఖ) చైర్మెన్ గోలి ప్రణీత రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీకేంద్రాల భవన నిర్మాణ పనులను పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పిల్లలకు బాలింతలకు అందజేసే పౌష్టికాహార విషయంలో శ్రద్ధ తీసుకొని, వారి ఎదుగుదలకు తోడ్పడాలి అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో కష్ణారెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, జెడ్పిటిసి సభ్యురాలు కె లక్ష్మి, డీఆర్డీఓ మందడి ఉపేందర్ రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు స్వరాజ్యం, రాణి ,సఖి కేంద్రం అధికారి వనజ, జెడ్పీ సూపరింటెండెంట్ యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.