Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : రైల్వే గేట్ అండర్పాస్ నిర్మాణంలో రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు చక్క వెంకటేష్ కోరారు. మండల కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అండర్పాస్ రోడ్డు వెడల్పు బాధితులకు సీపీఐ అండగా ఉంటుందన్నారు . ఈ సమావేశంలో నాయకులు పేరపు రాములు , చవుడపోయిన కనకయ్య ,గొటి పాముల రాజు, మాటూరు జానమ్మ, బొడ్డు ఆంజనేయులు ,తెడ్డు ఆంజనేయులు ,పర్శరాములు పాల్గొన్నారు.