Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మందుల విప్లవ్ కుమార్
నవతెలంగాణ -రామన్నపేట
నేడు నాటే ప్రాణమున్న మొక్కే రేపటి ఊపిరి అని డీివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు మందుల విప్లవ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఏప్రిల్ 1ఫూల్ డే చేయకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకతిని కూల్ చేయండి అనే నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కషి చేయాలని కోరారు. వారసులకు ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాగైనా బతికేస్తారు కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఎవరు బతకలేరని, అందుకోసం మొక్కలు నాటి ఆక్సిజన్‌ను ఆస్తిగా ఇచ్చి, రేపటి తరాన్ని కాపాడుకోవాలని కోరారు. చెట్లను రక్షిస్తే ఆ చెట్టే కాపాడుతుందిని ప్రకతిలో జల, వాయు, భూమి కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షులు మెట్టు శ్రావణ్, సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి కన్నెబోయిన యాదయ్య, వార్డు సభ్యులు వేముల సైదులు, మేడి మధు, బావండ్ల పల్లి ప్రవీణ్ కుమార్, గుండాల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.