Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్గొండ
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 50 ఏండ్లు నిండిన కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ద్వారా రూ.6వేల పింఛన్ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నల్లగొండ పట్టణ విస్తతస్థాయి సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల పోరాటాల ద్వారా ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డులో సేస్ రూపంలో వచ్చిన డబ్బులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కరోనా కారణంగా పని కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 7500 చొప్పున నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య యూనియన్ గౌరవ సలహా దారులు ఎండీ సుల్తాన్, అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్ ప్రధాన కార్యదర్శి గుండె రమేష్ ,కోశాధికారి బైరు నరసింహ, ఇబ్రహీం భాష భీమనపల్లి శంకర్ ,గాదరి నాగరాజు, ఏంజెల్ రాజు ,బర్ల శ్రీనివాస్ ,పట్టాల వెంకన్న ,ఎస్ కే జానీ , నూకల శ్రీనివాస్ ,బుర్రి లింగస్వామి,బాయిల్ల లింగయ్య కొండేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.