Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఈనెల 5వ తేదీన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 14వ తేదీన నిర్వహించాల్సిన ఉత్సవాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన ఏర్పాట్లపై షెడ్యూల్డ్ కులాల అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత సంఘాలు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ హాజరై మాట్లాడారు.అందరి అభిప్రాయాలను తీసుకున్నామని గత ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ సూచనలు ఆదేశాలు పాటించి అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలు రాగానే ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్ని విషయాలను కలెక్టర్‌తో చర్చించి, ఎస్సీల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ భువనగిరి ఏసీపీ భుజంగరావు, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ రాజు, ఎస్సీ డీడీ సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య, వివిధ సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య, బర్రె జహంగీర్, నాగారం అంజయ్య, ప్రమోద్ కుమార్, డి రాములు, బర్రె సుదర్శన్ , బండారు రఘు వర్ధన్, సుర్పంగ శివలింగం, దొంత సత్యం, ఇటుకల దేవేందర్, దర్గా యి హరి ప్రసాద్, ఎడమ బాలకష్ణ, బుగ్గ జయ, డాక్టర్ ప్రమీల, భాస్కర్ నాయక్, కౌన్సిలర్లు పంగారేకల స్వామి, పడిగెల రేణుక ప్రదీప్, కుశంగల ఎల్లమ్మ, వెంకట్ నాయక్, అన్నంపట్ల కష్ణ, ఆనంద్, పాండు, యాదగిరి, నర్సింగ్ రావు పాల్గొన్నారు.