Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్సీఓ అరుణ కుమారి
నవతెలంగాణ -నార్కట్పల్లి
నాలుగో తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల ఆర్సీఓ హెచ్.అరుణ కుమారి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్న నారాయణపురం గ్రామంలో గల బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు . గురుకుల పాఠశాల ఉపాధ్యాయలచే సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు గురుకుల పాఠశాలను ప్రవేశ పరీక్ష రాసి అడ్మిషన్ పొందాలని సూచించారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో విలేజ్ లెర్నింగ్ సెంటర్ను కోవిడ్ నిబంధనలకనుగుణంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ టీ రమా , ఉపాధ్యాయులు పాల్గొన్నారు