Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక మండల కేంద్రంలో గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించారు. అధ్యక్షుడిగా సీసా శ్రీనివాస్ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డప్పు వీరస్వామి, మిర్యాల వనం రాజు,ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాముల సాయికష్ణ, జాయింట్ సెక్రెటరీగా వంగరి శి కుమార్, కోశాధికారిగా కల్లూరి సిద్దులు, స్పోట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పారనంది రవి కుమార్లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జూకంటి రవిందర్, వ్యవహరించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సీస శ్రీనివాస్ మాట్లాడుతూ తన ప్తె నమ్మకం వుంచి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రావుల రవీందర్రెడ్డి ప్రసాద్ ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుడ్ల స్వామి, రావుల రవీందర్రెడ్డి ,ప్రసాద్, పాల్గొన్నారు .
బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గోదా వెంకటేశ్వర్లు
భువనగిరి : భువనగిరి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గోదా వెంకటేశ్వర్లు గౌడ్ 31 మెజార్టీతో గెలుపొందారు. జనరల్ సెక్రెటరీగా సురకంటి జంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా కుక్క దూగ కష్ణ, ఉపాధ్యక్షులుగా గడిల నవీన్ కుమార్ కోశాధికారిగా మల్లేశం, కల్చర్ సెక్రెటరీగా సురేష్ ,స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రెటరీగా సిహెచ్ ఐలయ్య, లైబ్రరీ సెక్రటరీగా మట్ట వెంకటేశం ఎన్నికయ్యారు.