Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఇసుక వినియోగాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగించాలని, అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ నర్సయ్య హెచ్చరించారు. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని జూకంటి సంపత్ కు చెందిన ట్రాక్టర్ నంబర్ ఏపీ 24 ఎ ఎస్ 9514 ని ఆలేరు పెద్దవాగులో ఇసుక నింపి తరలిస్తుండగా పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ ట్రాక్టర్ ఓనర్ జూకంటి సంపత్ , డ్రైవర్ సురేష్‌పై కేసు నమోదు చేసుకొని ట్రాక్టర్‌ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఐ యుగేందర్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు ,నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.