Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1వతేదీ నుండి నుండి 27 వరకు రాష్ట్ర వ్యాప్త సర్వే
- ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్ ఎం.అడివయ్య
నవతెలంగాణ - భువనగిరి
తీవ్ర వైకల్యం కలిగినవారికి నెలకు రూ.20వేల ప్రత్యేక అలవెన్స్ చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.వెంకట్, ఎం.అడివయ్య ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జిల్లాకేంద్రంలో ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న 32 రకాల సమస్యల పై సర్వే చేస్తున్నామన్నారు. ఈ సర్వేలో వచ్చిన సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామని అవి పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులు విస్మరించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మానసిక వికలాంగుల తల్లిదండ్రులకు నెలకు రూ.3000 అలవెన్స్ చెల్లించాలని కోరారు. పెండింగ్ దరఖాస్తుల వెంటనే నిధులు విడుదల చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలం నుండి పెండింగ్లో ఉన్న ఆసరా పింఛన్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ బాధితులు అందరికీ రూ.3016 చెల్లించాలని, ఉపాధి హామీ వికలాంగుల అందరికీ 200 రోజులు పని కల్పించాలని కోరారు. మెట్రో డీలక్స్ హైటెక్ బస్సు లో వికలాంగులను అనుమతించాలని , వివాహం చేసుకుంటే 5 లక్షలు ప్రోత్సాహకం, ప్రభుత్వ ఉద్యోగం డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్.ప్రకాష్ కార్యదర్శి ఉపేందర,్ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, జిల్లా నాయకులు పద్మ, లలితా, లక్ష్మణస్వామి, సంతోష్, గోపాల్, మల్లేష్, గీత పాల్గొన్నారు.