Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన ఎస్పీ
- ప్రచారంలో మాస్కులు ధరించకపోతే కేసులు నమోదు చేయండి
నవతెలంగాణ-హాలియా
ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డీఐజీ ఏ.వీ.రంగనాధ్ హెచ్చరించారు. గురువారం ఆయన పట్టణంలో పర్యటించారు. ఎన్నికల విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండటం, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు మాస్కులు ధరించి ప్రచారం చేసే విషయంపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించే వారిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణలో సిబ్బంది పాత్ర చాలా కీలకమని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద పని చేస్తున్న సిబ్బంది ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, మద్యం, డబ్బు అక్రమ రవాణా అరికట్టే విధంగా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలూ కల్పిస్తున్నామని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్లను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి. డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు రాఘవులు, గౌరునాయుడు, సత్యనారాయణ, ఎస్ఐలు కొమిరెడ్డి కొండల్ రెడ్డి, శివ కుమార్, నర్సింహారావు, సైదాబాబు, మోహన్, సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఆఫ్రోజ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.