Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక కోడ్ ప్రతుల దగ్ధం
నవతెలంగాణ - సూర్యాపేట
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడల్ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో కార్మిక కోడ్ ప్రతులను దగ్ధం చేసి మాట్లాడారు. దేశంలోని కార్మికుల శ్రమను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దోపిడీ చేసి కార్పొరేట్లు, పెట్టుబడిదార్లకు అమ్మేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల, రైతులు, సామాన్య ప్రజల హక్కులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు దంతాల రాంబాబు మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.శేఖర్, వి.సాయికుమార్, పల్లేటి వెంకన్న, మార్క్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మునగాల : కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్లతో కార్మికులు అనేక ఇబ్బందులు పడతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, దేవుల కనకయ్య, వీరయ్య, కోటయ్య, నాగరాజు, మారయ్య, హుస్సేన్, శ్రీను, జాన్పాషా, లింగయ్య, పున్నారావు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా రాస్తారోకో చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాల జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ లతీఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చేపూరి కొండలు, ఏపూరి సత్యరాజు, షేక్‌జానీ,కర్ల కాంతారావు, వెంకన్న, మోషిన్, శంకర్, నర్సింహా, రాజశేఖర్, పిడమర్తి మధు, నాని, పాపయ్య, క్రాంతి, గోపి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌టౌన్ : కార్మిక చట్టాల సవరణను వెంటనే మానుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో రైస్‌మిల్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన వెంకన్న, గువ్వల అంజి, ఆకం కోటేశ్వరరావు, చింతకాయల పర్వతాలు, ధనమూర్తి, సామల కోటమ్మ, మొదుగు గోపమ్మ, మున్ని, రాధ, సుజాత, మంగమ్మ, చంద్రకళ, పద్మ, మణి తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు కోరారు. గురువారం పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో కార్మిక వ్యతిరేక బిల్లు ప్రతులను దగ్ధం చేసి మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కనకయ్య, చంద్రయ్య, వీరస్వామి, సైదులు, మధు, రాములు, వెంకన్న, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లి : సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక, రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ యాకుబ్, జె.కోటేశ్వర్రావు, నాగేశ్వర్రావు, నాగరాజు, రాములు, జానీ, వెంకటమ్మ, చంద్రకళ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.