Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్వర్ రెడ్డి
నవతెలంగాణ - పెద్దవూర
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నాగార్జునసాగర్ రూపు రేఖలు మారనున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారుర. ఉప ఎన్నికల్లో జానారెడ్డికి ఓటమి తప్పదన్నారు. ఆయన నియోజక వర్గానికి చేసిందేమీ లేదన్నారు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ప్రజలు చైతన్య వంతులు అవుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద వర్గాలకు చేరుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మన రాష్ట్రం రూ.2,27,147 తలసరి ఆదాయంతో ప్రథమ స్థానంలో ఉందన్నారు. అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ నోముల నర్సింహయ్య ఆశయ సాధన కోసం పనిచేసి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ గుంటుక వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రవినాయక్, ఎంపీటీసీ జటావత్ జ్యోతికృష్ణ తదితరులు పాల్గొన్నారు.