Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్
నవతెలంగాణ - సూర్యాపేట
జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. నేరాల తీరుతెన్నులపై ఆయన గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసు దస్త్రాలను పరిశీలిం చారు. తీవ్రమైన నేరాలు పెండింగ్‌లో ఉండకుండా సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కోర్టు అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై త్వరగా స్పందించాలన్నారు. గ్రామాల్లో త్వరగా పోలీసు గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడే వారిపై, అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహ రించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీ, నాకాబందీ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐలు రవి, శ్రీనివాస్, విఠల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవరావు, శివరాంరెడ్డి, ఎస్బీ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు రాజేష్, నర్సింహా, ఎస్సైలు భిక్షపతి, రామారావు, ఆర్ఎస్సై సంతోష్, డీసీఆర్బీ సిబ్బంది వెంకటయ్య, అంజన్‌రెడ్డి, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.