Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గానికి చేసింది శూన్యం
- పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-హాలియా
పేరు గొప్ప..ఊరు దిబ్బలా ఉంది జానా పనితీరు అని, ఆయన నియోజకవర్గానికి చేసింది శూన్యమని, బరిలోకి దిగి జానా భయపడుతున్నాడని, వెనక్కి తగ్గితే కనీసం గౌరవమైనా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం హాలియాలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, కోరుకంటి చందర్లతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో జానారెడ్డి దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఈ విషయం జానారెడ్డికి కూడా తెలుసన్నారు. జానారెడ్డి హుందాగా నామినేషన్ విత్ డ్రా చేసుకొని నోముల కుటుంబానికి సహకరిస్తే కొంతైనా గౌరవం దక్కేదన్నారు. సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందని, 35 ఏండ్లుగా జానారెడ్డి ఏం చేసిండో ఎవరికీ అర్ధం కాని విషయమన్నారు. నోముల భగత్ వెంట సీఎం కేసీఆర్ ఉన్నారని, ఒకసారి గెలిస్తే సాగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. ఈ సమావేశంలో మాజీ ఆప్కాబ్ చైర్మెన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సుధాకర్, చంద్రశేఖర్, పురుషోత్తం, రావుల చిన్న భిక్షం తదితరులు పాల్గొన్నారు.