Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ - నాగార్జున సాగర్
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలోని హిల్‌కాలనీలో గురువారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎలాంటి అభివద్ధికీ నోచుకోలే దన్నారు. నందికొండ మున్సిపాలిటీలో మసీదు, ఖబరస్తాన్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని హామీనిచ్చారు. జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇక్కడి ప్రజలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించ లేదన్నారు. ఉప ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ ఇన్చార్జిలు సునీల్‌రావు, కేవీ రామకృష్ణ, టీఆర్ఎస్కేవీ నియోజవర్గ అధ్యక్షులు ఎస్.కె.బషీర్, ఏస్కె.అబ్బాస్, ముస్లిం మైనార్టీ కార్యదర్శి సుభాని, వైస్ చైర్మెన్ మంద రఘువీర్, ఇక్బాల్, హఫీజ్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు రమేష్‌జీ, మంగ్తానాయక్, నిమ్మల ఇందిరాగౌడ్, రమావత్ మోహన్‌నాయక్, ఆదాసు విక్రమ్, మధు తదితరులు పాల్గొన్నారు.