Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిట్యాల
మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో ఓ భూమిలోని కడీిలను ధ్వంసం చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు భార్య స్వర్ణ మమత 2004లో 264సర్వే నెంబర్లో మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో హైవే విస్తరణలో కొంత పోగా మిగిలిన 2.29 ఎకరాల భూమిలో ఇటీివల హద్దులుగా పాతిన కడీలను ధ్వంసం చేసిన ఘటనలో మండలానికి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి , జడల ఆదిమల్లయ్య ,విజయవాడకు చెందిన పేర్ని హరినారాయణ ,కనగల్కు చెందిన జానయ్యలపై బాధితురాలు మమత గత నెల 26వ తేదీన ఫిర్యాదు చేసింది. మేరకు నలుగురిపై ఐపీిసీ 447,427 సెక్షన్ల కింద నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.