Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత సంఘం పోరాట ఫలితమే నీరా ప్రాజెక్టు
- రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
30 ఏండ్లుగా పోరాటం చేస్తే కల్లుగీత కార్మిక సంఘం చేసిన పోరాట ఫలితంగానే నందనంలోని ప్రాజెక్టు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక జరిగిందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం భువనగిరి మండలంలోని సిరివేణికుంట, బొల్లేపల్లి గ్రామాలలో జనచైతన్య పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి పైలెట్ ప్రాజెక్టుగా నందనం గ్రామం ఎంపికైందన్నారు. బొల్లేపల్లి , నాగిరెడ్డిపల్లి నందనం, అనాజిపురం , నమత పల్లి గ్రామాల వారు నీర తయారుచేయడానికి శిక్షణ ఇస్తారన్నారు. నీడ ప్రాసెసింగ్ యూనిట్ నందనం లో నెలకొల్పడం ద్వారా ఇక్కడ తయారు చేసిన నీరా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో గల స్టాల్లో విక్రయిస్తారన్నారు. ప్రజల వినియోగానికి నీరా కేంద్రాల ద్వారా అందించనున్నారు. ఈ కేంద్రానికి 500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాంతంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి, వత్తి నైపుణ్యతను పెంచాలని, వత్తిని ఆధునీకరించాలని, ప్రమాదాల బారి నుండి కాపాడుటకు వత్తిలో శాస్త్రీయ టెక్నాలజీని తీసుకురావాలని పాదయాత్ర బందం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని కుల వత్తులను ఆధునీకరించి, రుణాలు అందించాలని, ఎంబీసీ కులాలకు 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు.