Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం మండలంలోని సిరివేణి కుంట గ్రామానికి పాదయాత్ర బందం చేరుకున్న సందర్భంగా పాదయాత్ర సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం ఎత్తివేసి పేద ప్రజల మీద భారాలను మోపేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం సవరణలో ఇప్పటికే హద్దు అదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగడానికి, నిత్యావసర వస్తువులను పెట్టుబడిదారులు బ్లాక్ మార్కెట్లో నిల్వ చేయడానికి అవకాశం కల్పించిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం ఎత్తివేయడానికి మానుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఏడేండ్లుగా ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. జిల్లావ్యాప్తంగా 15వేల మందికిపైగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం పెండ్లి కాగానే అమ్మాయిల పేర్లు తొలగిస్తుందని, కొత్తగా పెండ్లైన అమ్మాయికి ఆ గ్రామం లో పేరు నమోదు చేసుకోవడం లేదని, పుట్టిన పిల్లల పేర్లు కూడా నమోదు చేయడం లేదని విమర్శించారు. రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.