Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలను వెలికితీయడానికి మండుటెండను సైతం లెక్కచేయకుండా సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర బందం 11 రోజులుగా జిల్లాలోని ప్రజా సమస్యలను వెలికి తీస్తూ గ్రామ గ్రామాన ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతోందని పాదయాత్ర రథసారధి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం చేపట్టిన సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర శుక్రవారం భువనగిరి మండలం బొల్లపల్లి, సిరివేణికుంటలో జరిగింది. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో జహంగీర్ మాట్లాడారు. బందానికి గ్రామ గ్రామాన వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఈ ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్నారన్నారు. పాదయాత్ర ముఖ్యంగా మూడు ముఖ్యమైన అంశాలపై ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందని ఆ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాన్ని వివరిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు జరిగే నష్టాలను పాదయాత్ర బందం సభ్యులు ప్రజలకు వివరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారని, వెంటనే అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నూతన రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. రేషన్ కార్డు, పింఛన్ మంజూరు కోసం ప్రజల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.ప్రభుత్వం వెంటనే గ్రామాలలో అర్హులైన పేదలను గుర్తించి వారికి రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. పాదయాత్ర జిల్లావ్యాప్తంగా సమస్యలను వెలికి తీస్తూ ,ప్రభుత్వ లోపాలను ప్రజలకు వివరిస్తూ పోరాటమే శరణ్యమని చెబుతూ పాదయాత్ర బందం ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్త సమస్యలపై ఏప్రిల్ 22న పాదయాత్ర ముగింపు సభలో పోరాట కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. మండలంలోని సిరివేణికుంటలో తీవ్ర వికలాంగత్వం కలిగిన బాలునికి రూ.10వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నుండి పింఛన్ వచ్చినా అది అతని పోషణకు సరిపోక తల్లి కూలి పని మాని కొడుకును చూసుకోవలసిన పరిస్థితి ఉన్నారు. ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సహకారం అందించాలని కోరారు. బొల్లెపల్లికి చెందిన ఆశాకార్యకర్తలు పాదయాత్ర బృందానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, బట్టు పల్లి అనురాధ, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, పాదయాత్ర బందం సభ్యులు ధీరావత్ రమేష్ నాయక్ జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, మాయ కష్ణ, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, మండల నాయకులు గోనుగుంట్ల శ్రీనివాసు, ఏదునురి మల్లేశం, కొండ అశోకు, అబ్దుల్లాపురం వెంకటేష్, ఎద్దు నూరి వెంకటేష్, కడారి రాజమల్లు , బొల్లేపల్లి ఎంపీటీసీ గడ్డమీద చంద్రకళ వీర స్వామి గౌడ్, మల్లేష్ గౌడ్, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.