Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీిఐ చంద్రశేఖర్ రెడ్డి
నవ తెలంగాణ - నల్లగొండ
కరోనా రెండో దశ విపత్కర పరిస్థితుల్లో మానవాళి మనుగడకు మాస్కు ధరించడం శ్రీరామరక్షగా మారిందని అందుకే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని నల్లగొండ టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలో మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు, ప్ల కార్డులతో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు మాస్కులు అందించి తప్పక ధరించాలని సూచించారు. మాస్క్ ధరించకపోతే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిబ్బంది రమేష్, నాగేశ్వర్ రావు, నాగరాజు, హట్టి, వెంకట్రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.