Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని ఖాశీంపేట బేతేస్థ ప్రార్థన మందిరంలో పోస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బిషప్ డాక్టర్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు.కరోనా బేతెస్థ ఆధ్వర్యంలో గాస్పల్ టీవీ, హైకోర్టు అడ్వకేట్ సుధీర్‌కుమార్ సహాయంతో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు గుడ్‌ఫ్రైడే ఈస్టర్ ఆరాధనకు హైకోర్టు అనుమతించిందన్నారు.అందుకు సహకరించిన సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావుకు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ నాయకులు జాటోత్ మకట్‌లాల్, పాస్టర్ హోసన్నా, సైమన్‌రాజ్, డాక్టర్ జాషువా, నాగరాజు, పేతురు, సైమన్, నవీన్‌రాజ్ పాల్గొన్నారు.
గరిడేపల్లి : మరణం ఓటమి కాదని, ఈ రోజుల్లో క్షమాపణకు విలువలేదని పాస్టర్ జె జె సామ్యూల్ సన్ అన్నారు. శుక్రవారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మండలంలోని వెలిదండ గ్రామంలోని పెనుయేలు వర్షిప్ సెంటర్లో జరిగిన శుభశుక్రవారం(గుడ్‌ఫ్రైడే)ను పెనుయేలు సంస్థ అధ్యక్షులు పాస్టర్ జె జె సామ్యూల్ సన్ ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సుధాకర్, లుకా, జోసెఫ్ ,రాజు, హనోక్, రూతమ్మా, లలిత, డాక్టర్ భిక్షపతి పాల్గొన్నారు.