Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపం చెంది గత నెల 26న వరంగల్‌లో పురుగుల మందు తాగి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడా సునీల్‌నాయక్ మతి చెందాడని, ఆయన ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదని వారం రోజుల కింద పురుగుల మందు తాగి మత్యువుతో పోరాడుతూ బోడా సునీల్ నాయక్ మతి చెందడం నిరుద్యోగులకు తీరని మనోవేదనను కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో సకాలంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ఏడేండ్లుగా చదివిన గానీ ఉద్యోగాలు రాక పేద, మధ్యతరగతి నిరుద్యోగులు రూ.వేలల్లో ఖర్చు పెట్టి పుస్తకాలు కొని, రూ.లక్షల్లో ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని చదివినా..ఉద్యోగాలు రాక తల్లిదండ్రులను చూసుకోలేక, పెండ్లిళ్లు చేసుకోలేక, బంధువులు, మిత్రుల దగ్గర తల ఎత్తుకొని తిరగలేక నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడిలో, మానసిక సంఘర్షణ, మనోవేదన, పట్టరాని బాధ, ఎవరికీ చెప్పుకోలేని అయోమయ పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.ఈ ఆత్మహత్యలు ఆగిపోవాలంటే వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, అకాడమిక్ ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు.చనిపోయిన సునీల్‌నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని కోరారు.
కేయూ విద్యార్థి సునీల్‌నాయక్ మరణం బాధాకరం
కాకతీయ యూనివర్సిటీ(కేయూ)లో చదువుతూ వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రామ్‌సింగ్‌నాయక్ తండాకు చెందిన బోడ సునీల్‌నాయక్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదంటూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరథనాయక్ అన్నారు. శుక్రవారం స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఆశతో ఎదురు చూస్తున్న యువతకు నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్థాపానికి గురవుతున్నారని, ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భతి లేదా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. చదువులో రాణిస్తున్న సునీల్ నాయక్ ఉద్యోగం రాలేదన్నఆవేదనతో మనస్తాపానికి గురయ్యారన్నారు.మృతుని కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో నాయకులు సైదానాయక్, గోపీనాయక్, శ్రీనునాయక్, మక్లానాయక్, లాలూ, మోతీలాల్ పాల్గొన్నారు.